ఐఏఎస్ కాబోయి.. చాయ్ బిజినెస్ లో అనుభవ్..
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లల్ని మంచి చదువులు చదివించి ..ఆఫీసర్లుగా చూడాలని భావిస్తుంటారు. ఇలాగే అనుభవ్ ను ఐఏఎస్ ఆఫీసర్‌గా చూడాలనేదే వారి తల్లి దండ్రుల కోరిక. అందుకే చిన్నప్పటి నుంచి అనుభవ్‌కు.. ఐఏఎస్.. ఐఏఎస్.. అంటూ బ్రెయిన్‌లో నూరిపోశారు. దీంతో అనుభవ్ కూడా తల్లిదండ్రుల మాటతో తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తికాగానే.. యూపీఎస్‌సీ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లాడు. తన ఫోకస్ మొత్తం సివిల్స్ ప్రిపరేషన్ మీదనే పెట్టాడు. వేరే ఆలోచన లేకుండా ఒకే లక్ష్యంతో ముందుకెళ్తున్న అనుభవ్‌కు ఒకరోజు తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది.అతడి పేరు ఆనంద్ నాయక్. అనుభవ్‌కు ఒకరోజు కాల్ చేసి.. ఒక మంచి బిజినెస్ ప్లాన్‌ను చెప్పాడు. అది అనుభవ్‌కు కూడా నచ్చింది. దీంతో Chai Sutta Bar కు బీజం పడింది. అది వాళ్ల స్టాల్ పేరు. చాయ్ సుట్టా బార్ పేరుతో చాయ్ షాప్‌ను ఓపెన్ చేశారు. ఐఏఎస్ అవ్వమని పంపిస్తే.. చాయ్ అమ్ముకుంటావా? అంటూ అభినవ్‌ను హేళన చేయని వాళ్లు లేరు.. తల్లిదండ్రులతో పాటు.. బంధువులు, స్నేహితులు కూడా ఆయన్ను చిన్నచూపు చూశారు.మొదట్లో చాయ్ స్టాల్‌ను పెట్టినప్పుడు వాళ్ల దగ్గర రూపాయి లేదు. కానీ.. అక్కడా ఇక్కడా అప్పులు చేసి. ఒక ఔట్‌లెట్‌ను తెరిచారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆ టీ స్టాల్‌ను ఓపెన్ చేశారు. ఇదివరకే ఉపయోగించిన ఫర్నీచర్‌ను తీసుకొని ఆ ఫర్నీచర్‌తో టీ స్టాల్‌ను సెట్ చేశారు. చివరకు టీ స్టాల్ పేరుతో బ్యానర్ చేయించడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. పాడుబడిపోయిన ఓ చెక్క మీద చాయ్ సుట్టా బార్ అని రాసి.. టీ స్టాల్ ముందు ఏర్పాటు చేశారు.అయితే.. ఐఏఎస్ వదిలేసి.. చాయ్ స్టాల్ పెట్టిన అభినవ్ గురించి అక్కడ స్థానికంగా తెలియడంతో.. చాయ్ షాప్‌కు కస్టమర్లు పెరిగారు. అక్కడ అభినవ్ పాపులర్ అయిపోయాడు. ఆయన స్టాల్ కూడా పాపులర్ అయిపోయింది. లోకల్ మీడియాలో అభినవ్ చాయ్ స్టాల్ గురించి స్టోరీస్ కూడా వచ్చాయి. అలా.. వాళ్ల సక్సెస్‌కు బీజం పడింది.నిజానికి.. చాయ్ బిజినెస్‌కు ఇండియాలో ఎంత స్కోప్ ఉందో అందరికీ తెలుసు. మన ఇండియాలో మంచినీళ్ల తర్వాత రోజులో ఎక్కువ సార్లు ఎక్కువ మంది తీసుకునేది చాయ్ అని సర్వేలు చెబుతున్నాయి. దాన్నే నమ్మారు అభినవ్, అతడి ఫ్రెండ్స్. 2016లో వీళ్లు టీ స్టాల్ కోసం 3 లక్షలు ఖర్చు పెట్టారు. అది కూడా అప్పు తీసుకొచ్చి. ఇప్పుడు.. వాళ్ల బ్రాండ్ పేరుతో దేశం మొత్తం మీద 165 ఔట్ లెట్స్ ఉన్నాయి. 18 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. సంవత్సరానికి ఈ కంపెనీ టర్నోవర్ ఎంతో తెలుసా.. 100 కోట్ల రూపాయలు. అంతే కాదు.. 250 ఫ్యామిలీలకు మట్టితో చేసే చాయ్ కప్పుల పని ఇప్పించి.. వాళ్లను ఆదుకుంటున్నాడు అనుభవ్. అలాగే.. ప్రస్తుతం తన టీమ్‌లో 100 మందికి పైగా పనిచేస్తున్నారు. ఆయన ఐఏఎస్ కాకపోయినా.. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్లు ప్రస్తుతం అనుభవ్ టీమ్‌లో పనిచేస్తున్నారు. అది అనుభవ్.. సక్సెస్ స్టోరీ. ఐఏఎస్ అవుదామని ఢిల్లీ వెళ్లి.. తన ఫ్రెండ్ చెప్పిన.. ఒకే ఒక్క ఐడియా నచ్చి బిజినెస్ రంగంలోకి వచ్చి.. కోట్లు సంపాదిస్తూ.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనుభవ్.