ఒక్క సెకనులో 10వేల హెచ్ డీ సినిమాలు..

అరుదైన రికార్డుని నమోదు చేశారు జపాన్ పరిశోధకులు. విషయం ఏంటీ అనుకుంటున్నారా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేల హెచ్‌డీ సినిమాలను (ఒక్కో సినిమా సైజు 4 గిగాబైట్లు) కేవలం ఒకేఒక్క సెకనులో ట్రాన్స్‌ఫర్‌ చేసి జపాన్‌ పరిశోధకులు అరుదైన రికార్డు నమోదు చేశారు. 319 టెరాబిట్ల సైజున్న ఈ డేటాను 1,864 మైళ్ల పొడవున్న ఆప్టికల్‌ కేబుల్‌ సాయంతో ప్రసారం చేశారు. దీంతో 172 టెరాబిట్ల డేటాను ఒక్క సెకనులో ట్రాన్స్‌ఫర్‌ చేసిన గత రికార్డును జపాన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పరిశోధకులు చెరిపేశారు. స్పీడ్‌ను పెంచేందుకు.. డాటాను లేజర్‌ కోంబ్‌ ద్వారా పంపి 552 ప్రత్యేక చానళ్లుగా విభజించామని తెలిపారు. ఒక్కో సిగ్నల్‌ను నాలుగు కోర్‌లుగా మార్చి ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా పంపామన్నారు. యాంప్లిఫయర్‌ సాయంతో డాటా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఈ తరహా సాంకేతికతను బ్యాకెండ్‌ నెట్‌వర్క్స్‌ ఆఫ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్లలో వినియోగిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *