కరోనాతో సహా అన్ని వేరియంట్లకి ..స్పుత్నిక్ వి వ్యాక్సిన్..

కరోనా వైరస్ తర్వాత బ్లాక్..వైట్ ఫంగస్ లతో పాటు డెల్టా వైరస్ షాకిస్తోంది. కాగా ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెల్టా స‌హా క‌రోనా అన్ని వేరియంట్ల‌పై స‌మర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గ‌మ‌లేయా నేష‌న‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ ఆఫ్ ఎపిడ‌మాల‌జీ, ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌) ఈ అధ్య‌య‌న ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి. ఆల్ఫా బీ.1.1.7 (తొలిసారి యూకేలో క‌నిపించింది), బీటా బీ.1.351 (తొలిసారి సౌతాఫ్రికాలో క‌నిపించింది), గామా పీ.1 (బ్రెజిల్‌లో క‌నిపించింది), డెల్టా బీ.1.617.2, బీ.1.617.3 (ఇండియాలో క‌నిపించింది) వేరియంట్ల‌ను అడ్డుకునే టైట‌ర్ల‌ను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేసిన‌ట్లు గ‌మ‌లేయా ఇన్‌స్టిట్యూల్ వెల్ల‌డించింది.నేరుగా వైర‌స్‌నే ఉప‌యోగించి చేసిన వైర‌స్ న్యూట్ర‌లైజింగ్ యాక్టివిటీ (వీఎన్ఏ)ని అంచ‌నా వేసి ఈ అధ్య‌య‌నం జ‌రిగిన‌ట్లు తెలిపింది. క‌రోనా తొలి వేరియంట్ అయిన బీ.1.1.1 స‌హా ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో క‌నిపించిన వేరియంట్ల‌ను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రేరిత సేరా ఎలా అడ్డుకుంటుందో ప‌రిశీలించారు. అంతేకాదు ఇత‌ర వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారుల‌తో క‌లిసి వ్యాక్సిన్ కాక్‌టెయిల్స్‌ను త‌యారు చేసే దిశ‌గా గ‌మ‌లేయా, ఆర్డీఐఎఫ్ అధ్య‌య‌నం నిర్వ‌హిస్తోంది. ఇండియా స‌హా ప్ర‌పంచంలోని మొత్తం 67 దేశాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిజిస్ట‌ర్ అయింది. ఇండియాలో ఈ మ‌ధ్యే ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌డం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *