కరోనా వైరస్ ను గుర్తించనున్న స్మార్ట్ ఫోన్..

కరోనా టెస్ట్ ని ఎలా చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ టెస్ట్ ని చేయించుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు కూడా. కాగా కొత్త కరోనా టెస్టును యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు తయారుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వైరస్ ని గురించి వివిధ రకాల సులభమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.ఒక వ్యక్తిలో కరోనా వైరస్ ను గుర్తించేందుకు స్మార్ట్ ఫోన్ లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కరోనాను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పద్దతి ద్వారా సరైన ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. బ్రిటన్ లో యూనివర్సిటీ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు కొత్త పద్దతి ద్వారా కరోనా మహమ్మారిని గుర్తిస్తున్నారు. దీనికి ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ అని పేరు పెట్టారు. ఇందులో కరోనా వైరస్ అనుమానితుల నుంచి నమూనాలను నేరుగా సేకరించడానికి బదులు వారి మొబైల్ స్క్రీన్ ల నుంచి స్వాబ్లు సేకరించి పరీక్షించారు.ముక్కు గొంతు నుంచి సేకరించిన స్వాబ్లకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ తేలిన వారు ఈ కొత్త విధానంలోనూ పాజిటివ్ తేలారు. ఈ విధానం ఆధారంగా ఫోన్ల నుంచి నమూనాలను సేకరించి వాటిని పరీక్షించారు. అయితే ఈ ఫలితాన్ని ఆ వ్యక్తికి నేరుగా చేరవేసేందుకు చిలీకి చెందిన అంకుర పరిశ్రమ డయాగ్నోసిస్ బయోటెక్ ఒక యంత్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎవరికైనా వైరస్ సోకి ఉంటే వారు ఫోన్ లో మాట్లాడేటప్పుడు ముక్కు నోటి నుంచి వెలువడే తుంపర్లు పెద్ద ఎత్తున ఫోన్ స్క్రీన్ మీద పడతాయి. అందుకే ఫోన్ తెరపై వైరస్ ఆనవాళ్లు ఎక్కువగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *