కరోనా వ్యాక్సిన్ ల వినియోగంలో మేటిగా నిలిచిన తెలంగాణ..

తెలంగాణ ప్రత్యేకం రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి పలు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇప్పుడు మరో రికార్డును సాధించిందీ రాష్ట్రం. కరోనా విలయం తాండవం చేస్తోన్న సమయంలో విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్‌ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు 2 లక్షల డోసులను అదనంగా సర్దుబాటు చేసుకున్నది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వివరాలను సమర్పించింది. మార్చి 1 నుంచి జూలై 13 వరకు దేశంలోనే అతి తక్కువ టీకాలు వృథా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలువడంతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకొని దాదాపు 2 లక్షల డోసులను అదనంగా పంపిణీచేసింది. ఈ విషయంలో జాతీయ సగటు 1.1 శాతంగా ఉండగా, తెలంగాణ సగటు దాదాపు 2 శాతంగా ఉన్నది. దేశవ్యాప్తంగా గత రెండు నెలల్లో 2.49 లక్షల డోసులు వృథా అయినట్టు కేంద్రం తెలిపింది. టీకాలు వృథా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్‌, ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, మణిపూర్‌, మేఘాలయ, పంజాబ్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. వివిధ కంపెనీల నుంచి ఉత్పత్తి అయిన టీకాల్లో 75 శాతం భారత ప్రభుత్వం సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేసిందని కేంద్రం పేర్కొన్నది. జూలై 20 వరకు 1.59 కోట్ల డోసుల టీకాలు తెలంగాణకు సరఫరా చేశామని, ఇందులో 1.06 కోట్ల డోసులు ఉచితంగా కేంద్రం పంపిణీ చేసినట్టు తెలిపింది. 9.25 లక్షల డోసులను రాష్ట్రం సొంతంగా సమకూర్చుకున్నదని, 43.59 లక్షల డోసులను ప్రైవేట్‌ దవాఖానలు సమకూర్చుకున్నాయని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *