కుక్కలా అరిచిన సీగర్ పక్షి..ఎక్కడో చూద్దాం..
మాట్లాడే పక్షులు చూశాం గాని ఇప్పుడో పక్షి అచ్చం కుక్కలా అరవడంతో ఇప్పుడా వార్త వైరల్ అవుతోంది. ఆ సంగతులు చూద్దాం. సోషల్ మీడియాపై సీగల్ పక్షుల దండయాత్ర కొనసాగుతోంది. తరచూ ఈ పక్షులు ఏదో ఒకటి చేసి… నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. పావురాల లాంటి ఈ పక్షులు… మనుషులు తినే ఆహారాన్ని ఎత్తుకుపోయే వీడియోలు తరచూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి సూపర్ మార్కెట్లలోకి వెళ్లి చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకుపోతుంటాయి. అలాంటి వీడియోలు కూడా వైరల్ అవుతాయి. తాజాగా ఓ సీగల్ పక్షి అచ్చం కుక్కలా అరిచింది. అదే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. మన దేశంలో పావురాలు ఎలాగో… విదేశాల్లో సీగల్ పక్షులు అలాగ. సైజు మాత్రం కాస్త పెద్దగా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. అమాయకంగా కనిపిస్తూ… చోరీలు చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉండగా… బాల్కనీ దగ్గరకు సీగల్ పక్షి వచ్చింది. అది ఇదివరకు కూడా కొన్నిసార్లు అలా వచ్చింది. దాంతో… దాన్ని వీడియో తీస్తూ… దాన్ని బెదిరిద్దామని కుక్కలా మొరిగాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ పక్షి కూడా కుక్కలా మొరగడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోయిన ఆయన… మళ్లీ అలాగే అన్నాడు. సీగల్ కూడా అలాగే చేసింది. ఈసారి మరో రకంగా మొరిగాడు. అలా అరవడం సీగల్‌కి రాలేదు. అది ముందులాగే అరిచింది. ఈ ఫుటేజ్ వేన్స్ షోల్స్ (Waynes Scholes) రికార్డ్ చేసినట్లు తెలిసింది. అతని కారణంగా ఇప్పుడీ కొత్త విషయం తెలిసింది. సీగల్ పక్షులు… తాము విన్నవాటిని కాపీ చేసుకొని… తిరిగి పలకగలవని అర్థమవుతోంది. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాలి. ఏమో మనలా కూడా అవి మాట్లాడగలవేమోనని…