కేటీఆర్ దెబ్బకు.. రేవంత్ ట్విట్టర్ బ్లాక్!

రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్.. చివరకు రేవంత్ మెడకు ఉరిగా మారింది. డ్రగ్స్ విషయంలో కేటీఆర్ పై నోరు జారిన రేవంత్ ఇప్పుడు నాలిక కరుచుకున్నాడు. రేవంత్ అసత్య ఆరోపణలకు కేటిఅర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. తాను ఎలాంటి పరీక్షలకు అయినా సిద్దమని, అయితే దానికి రాహుల్ గాంధీ సిద్దమా అని సవాల్ విసిరారు. రాహుల్ నీ టాగ్ చేస్తూ ట్వీట్టర్ లో కామెంట్ చేశారు. దీంతో విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నారని అగ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రేవంత్ తన ట్విట్టర్ ని బ్లాక్ చేసుకున్నాడు. వెంటనే తేరుకొని బ్లాక్ తొలగించుకున్నాడు. అయితే విషయం అప్పటికే ఆయన చెయ్యి దాటి పోయింది. ఇక మరో వైపు.. రేవంత్ పై హై కోర్టు లో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ ట్వీట్ చేయడం వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారింది.

తల పట్టుకుంటున్న కాంగ్రెస్…
రేవంత్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకు పార్టీ హైకమాండ్ ను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉందని ఢిల్లీ లోని 10 జెన్ పథ్ లో టాక్ వినిపిస్తున్నది. మొన్నటికి మొన్న శశి థరూర్ ను గాడిద అని పోల్చి రాహుల్ గాంధీ ని సైతం ఇబ్బందులకు గురిచేసిన రేవంత్..
తాజాగా డ్రగ్ ఛాలెంజ్ విసిరి మరోసారి రాహుల్ గాంధీ ని నేరుగా దిగజార్చడంపై ఢిల్లీ లో పార్టీ పెద్దలు మండిపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలో ఉండి కూడా ఆనాడు చంద్రబాబును అనవసర కేస్ లలో ఇరికించిన రేవంత్.. జాతీయ పార్టీలోకి వచ్చినప్పటికీ తీరు మారలేదు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది.
ఇలానే ఉంటే రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే నష్టం అని సీనియర్ నేతలు వాపోతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *