కేర‌ళ‌లో కొత్త ర‌కం క‌రోనా..సోకిందా ప్రాణం పోయిన‌ట్టే..

క‌రోనా ఇప్ప‌టికే రెండు వేవ్ ల‌తో భీభ‌త్సం సృష్టించింది. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ అంటున్నారు. అయితే కేరళలో కొత్త రకం కరోనా మ్యూటెంట్ బయటపడింద‌ట‌. తొమ్మిది జిల్లాలో దాని ఆనవాళ్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి స్థాయి నిర్థారణ కోసం శాంపిళ్లను జినోమిక్స్ కన్సార్టియాకు పంపాలని సూచించింది. అయితే నిన్న ఒక్కరోజే కేరళలో 22వేల 200 కేసులు వచ్చాయి. 116మంది చనిపోయారు.ఇక కేరళలోఆర్-వ్యాల్యూ ఒకటి కంటే ఎక్కువ ఉంది. పాజిటివీ రేటు 16శాతం పైనే కొనసాగుతోంది. ఇక దేశంలో కరోనా కేసులు తగ్గుతుండగా.. కేరళలో మాత్రం తగ్గడం లేదు. అక్కడ నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ 40వేల మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 95శాతం డెల్టా రకమేనని వైద్య వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ లో డెల్టా రకం కేసులు 33శాతం ఉండగా.. జులైలో 95శాతానికి ఎగబాకాయి. ప్రధానంగా జగిత్యాల, జనగామ, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా రకమేనని పరిశోధకులు నిర్దారించారు.మరోవైపు ఏపీలో ఈ నెల 14తో ముగుస్తున్న రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టడంతో పాటు ఈ నెల 16నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగిస్తారని సమాచారం. అయితే కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించే అవకాశముంది.ఇక దేశంలో మరోసారి రోజువారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24గంటల్లో కొత్తగా 41వేల 195మందికి కోవిడ్ సోకింది. ముందు రోజు ఈ సంఖ్య 38వేల 353గా ఉంది. ఇక కరోనాతో మరో 490మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 3లక్షల 87వేల 987మంది బాధితులు కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. రికవరీ రేటు 97.45శాతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *