‘కోవాగ్జిన్’ పై లాన్సెట్ జర్నల్ నివేదిక..ఏమని ఉందో తెలుసా..
కోవాగ్జిన్ ,కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తుంది. పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక ఇచ్చింది. లాన్సెట్ జర్నల్’ సైన్సు పేరు చెప్పుకుని అశాస్త్రీయ సమాచారాన్ని అందించి సొమ్ములు చేసుకునే మరో మామూలు చెత్త పత్రిక కాదు. వైద్య ప్రపంచం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య శాస్త్ర వేత్తలు సంపూర్ణంగా విశ్వసించే విశేష వైద్య పత్రిక (మెడికల్ జర్నల్) లాన్సెట్ జర్నల్. ఇంగ్లాండ్ లో 1823 లో మొదలైన లాన్సెట్ జర్నల్’ ఇంచుమించుగా 200 సంవత్సరాలుగా ప్రపంచ వైద్య శాస్త్ర రంగంలో జరిగిన పరిశోధనలు, అవిష్కరణలకు వేదికగా నిలిచిన జర్నల్, లాన్సెట్ జర్నల్. శాస్త్ర పరిశోధనలకు,శాస్త్ర వేత్తలకు తలమానికంగా నిలిచిన పత్రిక లాన్సెట్ జర్నల్. ఈ పత్రికలో వచ్చిన ప్రతి పరిశోధనా వ్యాసం, ప్రతి వ్యాసంలోని ప్రతి అక్షరం నూటికి రెండువందల పాళ్ళు విశ్వశించ వచ్చనే విశ్వాసాన్ని పత్రిక సొంతం చేసుకుంది. అంతే కాదు, ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు.