కోవిడ్ సెంటర్ లో చిందేసిన డాక్టర్స్..
నిత్యం పేషెంట్లతో బిజీ బిజీగా ఉండే డాక్టర్లు హుషారుగా చిందేస్తే ఆ కిక్కే వేరప్ప. ఇదిగో అదే జరిగింది. డాక్టర్లు అంతా కలిసి చిందేశారు. ఎక్కడ అనుకుంటున్నారా. మహారాష్ట్రలోని గోరేగావ్‌లో ఉన్న కోవిడ్ సెంటర్లో డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు చిందేశారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువ నమోదు అయిన సందర్భంగా వారంతా డ్యాన్సులు చేశారు. మరాఠీ పాటకు వందల సంఖ్యలో వర్కర్లు స్టెప్పులేశారు. పీపీఈ కిట్స్‌లో ఉన్న డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. గోరేగావ్‌లో ఉన్న నెస్కో కోవిడ్ సెంటర్‌కు ఆ వీడియో చెందినట్లు తెలుస్తోంది. ఈ సెంటర్‌ను ఆపరేట్ చేసి ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ హిట్ మరాఠీ సినిమా సైరత్ లోని జింగాత్ పాటకు డ్యాన్స్ చేశారు. వీడియోను పోస్టు చేసిన గంటల్లోనే లక్షల లైక్‌లు, వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోను మీరూ ఎంజాయ్ చేయండి.