క్రికెట్ ప్రేమికులకు శుభవార్త..
కరోనా భయంతో క్రికెట్ స్టేడియానికి దూరమైన ప్రేక్షకులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించింది. భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ప్రేక్షకులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడొచ్చని పేర్కొన్నది. కేవలం 50 శాతం మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత్- ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే.