గాఢ నిద్ర ఆరోగ్యానికి మంచిదే..
గాఢ నిద్ర చాలా మంచిదట. పలు అనారోగ్యాలు దూరం అవుతాయట. ఆధునిక జీవనశైలిలో మనం నిద్రకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖాళీ దొరికిన కాసేపూ విశ్రాంతి తీసుకోవడం కంటే.. వివిధ మాధ్యమాల్లో వినోదం కోసం వెదుకుతూ గడిపేస్తున్నాం. ఒకవేళ నిద్రపోయినా.. అది సగం సగం నిద్రలానే మారిపోతోంది. నాలుగు గంటలు నిద్రపోయాం కదా.. ఆరు గంటలు నిద్రపోయాం కదా అని గంటలు లెక్కపెడ్తున్నాం. అయితే..ఎన్నిగంటలు నిద్రపోయాం అనేదానికన్నా ఎంత మంచి నిద్రపోయాం అనేది మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుందని నిపుణులు అంటున్నారు. అదేమిటి నిద్రలో మంచీ చెడూ ఉంటాయా అని మీరనవచ్చు. ఉంటాయి.. అదేమిటో వివరంగా తెలుసుకుందాం..మనకు పూర్తి నిద్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా గాఢ నిద్ర..దీనినే మంచి నిద్ర అని చెప్పింది. ఇది మన శరీరాన్ని రిపేర్ చేసే శక్తిని ఇస్తుంది. తగినంత నిద్ర స్థూలకాయం, గుండె జబ్బులు వంటి వ్యాధులను నివారించడమే కాకుండా అనారోగ్యంతో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.నిద్రలో నాలుగు దశలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైన దశ రాపిడ్ ఐ మూవ్మెంట్ (REM). మనం కలలు కనే దశ ఇది. ఈ దశ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఎనిమిది గంటలు నిద్రపోతున్నట్లయితే, అప్పుడు 20 శాతం అంటే 96 నిమిషాల గాఢ నిద్ర అంటే REM చాలా ముఖ్యం.deep-sleep