గుండెల్లో గునపం.. చావునే జయించాడు..

ఇనుపరాడ్డు ఛాతీలో దిగినా ప్రాణాలతో భయటపడ్డాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు. పంజాబ్ బతిండాలోని లెహ్రా గ్రామం. ఊళ్లో బండిపై వెళ్తూ చూసుకోకుండా కాస్త వేగం పెంచాడు. సరిగ్గా అక్కడ రోడ్డుపై ఇసుకలాగా ఉంది. ఆ వేగంలో బండి టైర్ పక్కకు ఒరిగింది. దీనితో బండి పై నుంచి జారి రోడ్డు పక్కకు పడ్డాడు. సరిగ్గా అక్కడే ఓ ఇనుప రాడ్డు ఉంది. అది సర్రున అతని ఛాతీలోకి దూసుకెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఛాతీ దగ్గర నొప్పిగా ఉందేంటి అని చూడగా రక్తం స్పీడ్ గా కారుతోంది. తన పరిస్థితి చూసి తనకే భయం వేసింది. అర నిమిషం ముందు ఎలా ఉన్నా ఇప్పుడెలా ఉన్నా చిన్న రోడ్డు ప్రమాదం నన్ను చంపేసేలా ఉందే అనుకున్నాడు. కాస్త దూరం నుంచి ఈ ప్రమాదాన్ని చూసిన ప్రజలు పరుగెత్తుకుంటూ అతని వైపు వస్తుంటే అప్పటికే హర్దీప్ అపస్మారక స్థితి లోకి వెళ్లిపోతున్నట్లు కనిపించాడు. కొందరు కుర్రాళ్లు అతన్ని ఆదేశ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరిస్థితిని చూసిన డాక్టర్లు ఎవరితను ఎలా జరిగింది.. వంటివేవీ అడగలేదు. హడావుడిగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయారు. అప్పటికప్పుడు ఆరుగురు డాక్టర్లు 21 మంది పారామెడికోలు ఆపరేషన్లో తలమునకలయ్యారు. బయట అతన్ని తెచ్చిన కుర్రాళ్లకు టెన్షన్ టెన్షన్. ఆస్పత్రి మొత్తం ఇదే వార్త. అంత పెద్ద ఇనుప రాడ్డు అలా ఎలా గుచ్చుకుంది అనే అందరి ప్రశ్నా డాక్టర్లు నానా తిప్పలు పడి ఐదు గంటలపాటూ శ్రమించి మొత్తానికి ఆ రాడ్డును బయటకు తీసి కుట్రువేసి హర్దీప్ ను బతికించారు. ఆ వార్త తెలియగానే ఆస్పత్రి మొత్తం ఆనందపడింది. ఎందుకంటే ఇదో అరుదైన ఆపరేషన్. థియేటర్ నుంచి బయటికి వచ్చిన సర్జన్ డాక్టర్ సందీప్ ధండ్ అతని అదృష్టమేంటంటే ఆ రాడ్డు అతని గుండెకు తగల్లేదు. అది కొద్దిగా తగిలినా అతను చనిపోయేవాడే అని చెప్పారు.ఈ కేసులో మరో ప్రత్యేకత ఉంది. ఆస్పత్రికి వచ్చాక హర్దీప్ యాక్టివ్ అయ్యాడు. ఎలాగైనా బతకాలనే ఆశ ఆతనిలో బాగా పెరిగింది. ఓవైపు డాక్టర్లు తన బాడీ నుంచి రాడ్డును తీస్తూ ఉంటే అతను దాన్ని కళ్లారా చూడటమేకాదు. మాట్లాడుతూ ఉన్నాడు కూడా. మీరు ఎలాగొలా రాడ్డును బయటకు తియ్యండి. మిగతాది ఆ దేవుడి చేతిలో ఉంటుంది ప్లీజ్ అంటూ వారితో మాట్లాడసాగాడు. అది 6 అడుగుల రాడ్డు. దాన్ని తొలగించినంతసేపూ చాలా రక్తం పోయింది. అంత రక్తం పోయినా మనిషి చనిపోతాడు. కానీ లక్కీగా అతను బతికే ఉన్నాడు. ఈ ఘటన జరిగింది గురువారం. శుక్రవారం పోలీసులకు చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులుఅతని పరిస్థితి ఎలా ఉందని డాక్టర్లను అడిగారు. ఆపరేషన్ తర్వాత హర్దీప్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతనికి ఫుల్ రెస్ట్ కావాలి. ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చెయ్యలేం అని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు కూడా నో ప్రాబ్లం అతను కోలుకున్న తర్వాత మాకు సమాచారం ఇవ్వండి అని డాక్టర్లకు చెప్పారు. ఇలా ఈ కేసును అందరూ ప్రత్యేక కేసుగా గుర్తించి సహకరించారు. ముందుగా అతడి శరీరం బయట ఉన్న ఇనుప రాడ్డును కట్టర్ సహాయంతో తొలగించారు. అనంతరం ఆరుగురు సర్జన్లు 15 మంది ఆరోగ్య సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించారు. దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో రక్తం విపరీతంగా కారుతుండడంతో వైద్యులు ఆందోళన చెందారు. అయినా..వస్తున్న ఆటంకాలను అధిగమించి…విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. వైద్యుల చేసిన కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆపరేషన్ విజయంతంగా పూర్తి చేసి బతికించినందుకు హర్దీప్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *