చరిత్రలో నేడు.. అమలులోకి రాజ్యాంగం

దేశవ్యాప్తంగా నేడు (జనవరి 26న) 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. 71 సంవత్సరాల క్రితం 1950 లో ఇదే రోజున 1935 భారత ప్రభుత్వ చట్టం స్థానంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించే పని 1949 నవంబర్ 26 తేదీనే పూర్తయింది. దీనిని రాజ్యంగ సభ కూడా ఆమోదించింది. 1950, జనవరి 26న రాజ్యాంగం పూర్తయినట్లు కాంగ్రెస్ ప్రకటించడంతో అప్పటి నుంచి జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన దేశ చివరి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాను ప్రకటించారు.

మొదటి గణతంత్ర దినోత్సవంలో భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 21 తుపాకుల వందనంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశాన్ని పూర్తి గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఆ సమయంలో ఆయన హిందీ, ఆంగ్ల భాషల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. వాస్తవానికి, బ్రిటిష్ ఇండియాలో ప్రభుత్వ విధానాన్ని రూపొందించడానికి 1935 భారత ప్రభుత్వ చట్టం ఉపయోగించబడింది. ఇందులో వివిధ రాచరిక రాష్ట్రాలకు కూడా హక్కులు ఇచ్చారు.

1947 జూలై 18న భారత స్వాతంత్ర్య చట్టం, 1947 కు బ్రిటిష్ పార్లమెంట్ నుంచి రాయల్ ఆమోదం లభించింది. ఈ చట్టం మౌంట్ బాటన్ ప్రణాళికను అమలులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడినది. దీని ప్రకారం భారతదేశం రెండుగా విభజించబడింది. దీని కింద, పాకిస్థాన్ తన స్వాతంత్ర్యాన్ని 1947 ఆగస్టు 14న, భారత్ 1947 ఆగస్టు 15న తన స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. దీనికి ఏడాది ముందు అంటే 1946 డిసెంబర్ 9న, భారతదేశానికి సొంత రాజ్యాంగం ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక రాజ్యాంగ సభ ఏర్పాటైంది. మూడేళ్ల సమావేశాల తరువాత రాజ్యాంగం సిద్ధమైంది. 1949 నవంబర్ 26న ఆమోదించారు.

గుజరాత్‌లో భూకంపం

సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున గుజరాత్‌లో బలమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి వైపరీత్యంలో వేల మంది మరణించారు. భుజ్ నగరం తీవ్రంగా ప్రభావితమైంది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9 నుంచి 7.9 వరకు నమోదైంది. ఈ భూకంపం పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణ భారతదేశాలను కూడా ప్రభావితం చేసింది. రెండు వేల మంది చనిపోయినట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వేల మంది భవనాల శిథిలాల కింద ఖననమయ్యారు. 400 మందికి పైగా పిల్లలను భుజ్‌లోని పాఠశాలలో ఖననం చేశారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు

2020: హెలికాప్టర్ ప్రమాదంలో 41 ఏళ్ల అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కోబీ బ్రయంట్ మృతి

2015: ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మరణం

2010: మీర్పూర్‌లో బంగ్లాదేశ్ నుంచి రెండో టెస్టును 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2- 0 తో కైవసం చేసుకున్న భారత్‌

2008: శ్రీలంక ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈ నాయకుడు మురళీధరన్‌కు బ్రిటన్‌ కోర్టు 9 నెలల జైలు శిక్ష విధింపు

2001: ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్‌కు భారతరత్న అవార్డు ప్రదానం

1999: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో మహిళల లైంగిక దోపిడీపై ప్రపంచ సమావేశం

1972: ‘అమరవీర సైనికుల జ్ఞాపకార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జవాన్‌ జాతీయ స్మారకం ఏర్పాటు

1965: హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించిన భారత్‌

1950: భారత తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రమాణస్వీకారం

1930: దండి మార్చ్‌ ను ప్రారంభించిన మహాత్మాగాంధీ

1882: ముంబై- కోల్‌కతా మధ్య టెలిఫోన్‌ లైన్‌ ప్రారంభం

1876: ముంబై- కోల్‌కతా మధ్య రైల్వే మార్గం ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *