చాక్లెట్ తింటే ఎన్ని లాభాలో..!
చాక్లెట్.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా లొట్టలేసుకుంటూ తింటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని చాలావరకు తల్లిదండ్రులు వద్దంటారు. చాక్లెట్ వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా. చాక్లెట్‌లలో చాలా రకాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్ తింటే తప్పకుండా బరువు తగ్గవచ్చని అంటున్నారు వైద్యులు. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్య లాభాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గడంతోపాటు.. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఏటా ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా చాక్లెట్ తో కలిగే లాభాలు మీ కోసం..
- గుండెకు మంచివి
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని సిరలు, ధమనులు సాధారణంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఫలితంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
డార్క్ చాక్లెట్లలో కోకో సారం ఉంటుంది. ఇందులో ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఈ ఫ్లేవనోల్స్ మీ అభిజ్ఞా పనితీరుకు గొప్పగా పనిచేస్తాయి.
- ఆకలిని తగ్గిస్తుంది
చాక్లెట్ తినడం వల్ల ఆకలిని తగ్గించవచ్చు. ఆకలి అయినప్పడు 20 నిమిషాల ముందు చాక్లెట్ తినడం వల్ల కొన్ని గంటల పాటు ఆకలిని నిరోధించవచ్చు. మెదడులోని హర్మొన్లను ప్రేరేపిస్తుంది.
- వ్యాయామంలో సహాయపడతాయి
మీ రోజువారీ వ్యాయామంలో డార్క్ చాక్లెట్లు మీకు సహాయపడతాయి. రోజుకు సగం చాక్లెట్ బార్ తినడం వల్ల దీంట్లోని ఎపికాటెచిన్ అనే ఫ్లేవనోల్ వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు సహాయపడుతుంది.
- కొలెస్ట్రాల్ అదుపులో
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, డార్క్ చాక్లెట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడంలో సహాయపడుతుంది. స్టెరాల్స్, ఫ్లేవానాల్స్ తోపాటు కొన్ని డార్క్ చాక్లెట్ బార్‌లు తీసుకున్నవారిలో వారి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటున్నట్లు తెలిసింది.