చేప విచిత్ర రూపం..గొర్రె తల..మనిషి దంతాలు..
పేరుకి చేప కానీ విచిత్ర రూపంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వివరాలు చూద్దాం. సోషల్ మీడియాలో ఓ చేప తెగ సందడి చేస్తోంది. గొర్రె తల, మూతి. మనిషి దంతాలతో చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆ చేప చిత్రాన్ని తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ చేప ఎక్కడిది అంటారా.. అమెరికాలోని ఉత్తర కరోలినాలోనిది. కరోలినాలోని నాగ్స్ హెడ్లో ఆ చేప ఉంది. దాని పేరు షీప్స్హెడ్ ఫిష్. అక్కడ చిత్ర విచిత్ర చేపలు దొరుకుతాయి. అయితే అక్కడ పట్టుకున్నఈ విచిత్ర చేప గురించి మనం ఓ లుక్కేద్దాం.. సోషల్ మీడియాలో వైరల్ అయిన షీప్స్హెడ్ ఫిష్ నిజానికి జెన్నెట్స్ పీర్ అనే వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసింది. మత్స్యకారుడు నాథన్ మార్టిన్కు దొరికిన చేప అది. షీప్స్హెడ్ ఫిష్ చేపలు దాదాపుగా మసాచుసెట్స్ కేప్ కాడ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు ఉంటాయట. ఇప్పుడు ఈ చేప ఫొటో తెగ వైరల్ అవుతోంది.