చైనా గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్..

ఇప్పటికే చైనాని దుమ్మెత్తిపోస్తున్నారు కరోనా విషయంలో. చైనా వారి వల్లే కరోనా వ్యాపించిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. నిజా నిజాలమాట అటుంచితే. కొత్తగా గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను గుర్తించినట్టు చైనా పరిశోధకులు ప్రకటించారు. ‘రినోలోఫస్‌ పుసిల్లుస్‌’ అనే వైరస్‌ ఇందులో ఒకటని, ప్రస్తుత కొవిడ్‌-19 వైరస్‌కు ఇది జన్యుపరంగా దగ్గరగా ఉన్నవాటిల్లో రెండోదని తెలిపారు. షాండోంగ్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను ‘సెల్‌’ జర్నల్‌లో ప్రచురించారు. 2019 మే నుంచి 2020 నవంబర్‌ మధ్య కాలంలో చైనాలోని యునాన్‌ అనే ప్రాంతంలో గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. వీటిలో సార్స్‌-కొవ్‌-2 తరహా కరోనా వైరస్‌లు నాలుగు ఉన్నట్టు గుర్తించామన్నారు. రినోలోఫస్‌ పుసిల్లుస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో జన్యుపరమైన తేడాలు మినహా, మిగతా అన్నింట్లో సార్స్‌-కొవ్‌-2కు ఈ వైరస్‌ దగ్గరగా ఉన్నట్టు వెల్లడించారు. 2020 జూన్‌లో థాయ్‌లాండ్‌ నుంచి సేకరించిన సార్స్‌-కొవ్‌-2 సంబంధిత వైరస్‌ను, ప్రస్తుత ఫలితాలను విశ్లేషించగా కొవిడ్‌-19 వైరస్‌కు సన్నిహిత సారూప్యతగల వైరస్‌లు గబ్బిలాల్లో కొనసాగుతున్నట్టు వెల్లడైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *