జిల్లాగా హ‌న్మ‌కొండ‌..

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాను హ‌న్మ‌కొండ‌గా మారుస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. ఎట్ట‌కేల‌కు వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల కోరిక నెర‌వేరింది. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్ పేరుతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాను విభ‌జించారు. అయితే చారిత్ర‌క ప్రాతినిధ్యం ఉన్న హ‌న్మ‌కొండ పేరు వ‌చ్చేలా జిల్లా ఉండాలంటూ ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎప్ప‌టినుంచో ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌లే రామ‌ప్ప దేవాల‌యానికి కూడా యునెస్కో ప్రాతినిధ్యం ల‌భించింది. అంత‌టి ప్రాధాన్యం ఉన్న హ‌న్మ‌కొండ పేరు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో క‌లిసిపోయి ఉనికిలేకుండా ఉందంటూ స్థానిక ప్ర‌జ‌ల అభిప్రాయంగా ఉంది. ఈ అంశాల‌న్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం ఈరోజు ఉత్త‌ర్వులు జారీచేసింది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం హ‌న్మ‌కొండ‌లో క‌లుస్తోంది. మొత్తంగా 12 మండ‌లాల‌తో హ‌న్మ‌కొండ‌, 15 మండ‌లాల‌తో వ‌రంగ‌ల్ జిల్లాలు ఏర్పాట‌య్యాయి. వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వ‌రంగ‌ల్ జిల్లాలో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *