టీమిండియా.. 143/3
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య శనివారం రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ పీకల్లోతు కష్టాలలో పడింది. రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్ డకౌట్‌గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(97), పుజారా(21) రెండో వికెట్‌కు 85 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. లీచ్ వేసిన బంతిని సరిగా అర్ధం చేసుకోలేక స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పుజారా. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0).. మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 86 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగా ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(97 బ్యాటింగ్: 117 బంతుల్లో 14×4, 1×6), అజింక్యా రహానే (25) ఉన్నారు.