డయాబెటీస్ ఉందా.. కరోనాతో జర భద్రం..

డయాబెటీస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలట ఈ సమయంలో. విషయం ఏంటంటే కరోనా  వైరస్ ముప్పు షుగర్ ఉన్నవారిని కలవర పెడుతోంది. దీని వల్ల డయాబెటీస్ ఉన్నవారిరక్తంలో గ్లూకోజ్ స్థాయి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. డయాబెటిస్ అనేది ఒక వ్యక్తిని పోషకాలు సద్వినియోగం చేసుకోవడం.. చెడు రక్తాన్ని కలిగి ఉండడం, దీర్ఘకాలిక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇక కరోనా వైరస్ మాదిరిగానే డయాబెటిస్ వైరల్ లోడ్‏తో పోరాడడం మరింత కష్టతరం చేస్తుంది. అలాగే ఇతర వ్యాధులను వచ్చేలా చేస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆసుపత్రిలో చేరే డయాబెటిక్ రోగులకు అంతర్లీన వాస్కులర్ సమస్యలు ఉన్నాయని.. దీంతో గుండె సమస్యలు, శ్వాస కోస సమస్యలు.. దీర్ఘకాలిక ఉపిరితిత్తుల వ్యాధుల వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇవేకాకుండా కరోనా లక్షణాలు మరిన్ని ఉండే అవకాశం ఉంది. అందుకే డయాబెటిక్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.అలాగే కరోనా వచ్చింది అని తెలియడానికి వీరిలో చర్మం దద్దుర్లు, మంట, అలెర్జీ లక్షణాలు ఉంటాయి. అలాగే కాలి గోర్లు, దద్దుర్లు, ఎర్రటి మచ్చలు, కరోనా వలన చర్మంపై ప్రభావం చూపే అన్ని సంకేతాలు షుగర్ రోగులలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరు గాయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటారు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంతో మంట, వాపు, ఎర్రటి ప్యాచెస్, బొబ్బలు వచ్చే అవకాశాలుంటారు. అందువలన డయాబెటిస్ రోగులు చర్మ సమస్యలపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.ఇక ప్రస్తుతం కరోనా రోగులు ఎదుర్కోంటున్న అతి పెద్ద సమస్య ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం. రోగనిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా.. షుగర్ లెవల్స పెరగడం.. ఆక్సిజన్ కొరత ఏర్పడడం వంటివి జరుగుతుంటాయి. వీరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఉపిరితిత్తుల సమస్యలు, ఛాతీ నొప్పితోపాటు పల్మనరీ సమస్యలు, హైపోక్సియా, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ రోగులలో ఆక్సిజన్ లెవల్స్ తొందరగే తగ్గే అవకాశం ఉంది.ఇక కరోనా రోగులలో న్యూమోనియా మరింత ప్రమాదం చేకూర్చే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారికి హెవీ బర్న్, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం, శ్వాస సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది. ఇవి శరీరంలో కరోనా మరింత ప్రభావం చూపించడానికి సహయపడతాయి. టైప్ -1 మరియు టైప్ -2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ ప్రమాదం సమానంగా ఉంటుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ లో ఉపిరితిత్తులపై అధిక ప్రభావం ఉంటుంది. ఇక ఇప్పుడు కరోనా రోగులను ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య బ్లాక్ ఫంగస్. దీనివలన ముఖ వైకల్యం, వాపు, తలనొప్పి, చికాకు కలిగించే ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రస్తుతం డయాబెటిస్ రోగులలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *