తలపాగా కలర్ కి మ్యాచ్ అయ్యే కార్లు..ఎక్కడో తెలుసా..

తలపాగా కలర్ కి మ్యాచ్ అయ్యే కార్లు వినడానికి వింతగా ఉన్నా..ఇది నిజం. వివరాల్లోకి వెళ్లితే. ఆ కార్లు కూడా ఏదో మామూలు కార్లు కావు. చాలా ఖరీదైనవి. మరీ ఆ వ్యక్తి ఎవరు తెలుసుకుందాం.లండన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యాపార వేత్త రూబెన్ సింగ్ ప్రతి రోజు ధరించే తలపాగా రంగుకు మ్యాచ్ అయ్యే విధంగా రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడు. తలపాగా రంగుకు రోల్స్ రాయిస్ కారు మ్యాచింగ్ ఏంటబ్బా అని అందరు ఆశ్యర్యపోతారు. ప్రపంచ ప్రముఖ బ్రిటీష్ లక్జరీ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్ రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన రోల్స్‌ రోయిస్‌ కార్లను తలపాగా కోసం ఇప్పటి వరకు 15కుపైగా కొనుగోలు చేశారు రుబెన్ సింగ్. రూబెనె సింగ్‌ లండన్‌లో ఉన్నపుడు ఒక బ్రిటన్ వ్యక్తి చేసిన ఛాలెంజ్‌ను నిజం చేస్తూ తను రోజు ధరించే తలాపాగా రంగుకు మ్యాచ్ అయ్యేలా రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఇంతకూ ఆ ఛాలెంజ్ ఏంటి అని ఆరా తీస్తే.. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని భారత సంతతికి చెందిన ఈ రూబెన్ సింగ్ నిరూపించాడు. ఇంగ్లాండులో స్థిరపడిన రూబెన్ సింగ్ ఒక ఆంగ్లేయుడితో చేసిన ఛాలెంజ్‌ను నెగ్గేందుకు ఏకంగా ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడు.ఓ ఇంగ్లాండ్ వాసి తన తలపాగాను అవమానిస్తూ బ్యాడేంజ్ అని వెక్కిరించే వాడట, ఇందుకు విసుగు చెందిన రూబెన్ సింగ్ నా తలపాగానే అవమానిస్తావా..? చూస్తూ ఉండు, నేను ప్రతి రోజు ధరించే తలపాగా రంగుకు మ్యాచ్ అయ్యే రోల్స్ రాయిస్ కార్లను కొని, తలపాగా పవర్ ఏంటో చూపిస్తానని అంటూ ఛాలెంజ్ చేశాడట. తాను ధరించే తలపాగా రంగుకు మ్యాచ్ అయ్యే విధంగా రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి తాను ఛాలెంజ్ నెగ్గినట్లు రూబెన్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక ఆంగ్లేయుడు తలపాగా మీద చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ వివిధ రంగుల్లో ఉన్న రోల్స్ రాయిస్ కొనుగోలు చేసిన రూబెన్‌ సింగ్ బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితం అని చెప్పాలి. ఆంగ్లేయుడికి రూబెన్ సింగ్ మధ్య జరిగిన పందెం ప్రకారం, ఇందులో ఎవరు ఓడిపోతే వారు స్వచ్ఛంద సంస్థగా డబ్బును విరాళంగా ఇవ్వాలని పందెం వేసుకున్నారు. అయితే, రూబెన్ సింగ్ పందెం ప్రకారం ఏడు రోజుల కోసం విభిన్న రంగుల్లో ఉన్న కార్లను కొనుగోలు చేసి గెలిచాడు. సిక్కు మతానికి చెందిన బిలియనీర్ రోజు తన తలపాగా రంగును పోలి ఉండే రోల్స్ రాయిస్ కార్లతో వారం పాటు దిగిన ఫోటోలను ఇండియన్ బాడీ బిల్డర్ వారిందర్ గుహ్మన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.బిలియనీర్ రూబెన్ సింగ్ తన సొంత తెలివి టలతో భారీగా సంపాదించాడు. అయితే, 2007లో దివాళా తీయడంతో చాలా నష్టపోయాడు. ఇంగ్లాండులో బ్రిటన్ బిల్‌గేట్స్ అంటే తెలియని వారుండరు. తన తండ్రి మీద ఏ మాత్రం ఆధారపడకుండా సొంత కాళ్లమీద నిలబడి ఎంతో శ్రమించి వ్యాపార రంగంలో రాణించి భౄరీగా సంపాదించుకున్నాడు. రూబెన్ సింగ్ సుమారుగా 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించాడు. అప్పట్లో దీనికి మంచి పాపులారిటీ లభించింది. తన 17వ ఏట తాను స్థాపించిన ‘మిస్ ఆటిట్యూడ్’ స్టోర్‌లో రోజుకు 20 గంటలు పనిచేసేవాడు. చివరికి తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు.తరువాత వ్యక్తిగతంగా దివాలా తీయడంతో ఇండియాకు చెందిన బిలియనీర్ రూబెన్ సింగ్ తన రెండవ బిజినెస్ ఆల్‌డే‌పిఎ సంస్థ(AlldayPA) మీద పట్టును కోల్పోయాడు. 2007-2017 మధ్య మళ్లీ కష్టపడంతో రూబెన్ సింగ్ మళ్లీ AlldayPA సంస్థను ఓ స్థాయికి తీసుకొచ్చి నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చాడు. తరువాత, కాల్ ఆన్సరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అనే సంస్థకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా భాద్యతలు చేపట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *