తెలంగాణకు ఎస్టీ రెసిడెన్షియల్‌ లా కాలేజీ

తెలంగాణకు ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్‌ లా కళాశాల మంజూరయ్యింది. లా కాలేజీకి ఏర్పాటుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కళాశాల అనుమతి మంజూరు పత్రాలను అధికారులు అందించారు. కొత్తగా ఏర్పటైన ఈ రెసిడెన్షియల్‌ లా కాలేజీతో మరో 60 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సును అందించనున్నారు. రెండో విడుత లా కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీలోని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాలేజీలోని మొత్తం 60 సీట్లలో ఎస్టీ అభ్యర్థులకు 39, ఎస్సీ 6, బీసీలకు 7 సీట్ల చొప్పున కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *