దారి తప్పిన పెంగ్విన్..తర్వాత ఏం జరిగింది..
ఇటీవల న్యూజీల్యాండ్ క్రీస్ట్చర్చ్ బీచ్లో ఒక పెంగ్విన్ దిక్కులు చూస్తూ కనిపించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అరుదైన అడెలీ జాతికి చెందినదని తేలింది. ఇవి అంటార్కిటికాలో ఉంటాయట. అక్కడి సముద్రంలో ఈతకొడుతూ కనిపించాల్సిన ఈ పెంగ్విన్.. దారి తప్పి మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి న్యూజిల్యాండ్ చేరుకుంది. దీన్ని స్థానికులు ‘పింగూ’ అని పిలుస్తున్నారు. తొలిసారి దాన్ని చూసినప్పుడు బొమ్మ పెంగ్విన్ అనుకున్నట్లు స్థానికులు చెప్పారు. ఇలా న్యూజిల్యాండ్లో అడెలీ జాతికి చెందిన పెంగ్విన్ కనిపించడం ఇది మూడోసారని అధికారులు చెప్పారు.