న‌గ్నంగా పూజ‌లు..ఇదొక ఆచార‌మే..ఎక్క‌డో తెలుసా..

భార‌త‌దేశంలో ఎన్నో ఆచారాలు..వాటిల్లో ఇదొక‌ట‌ని చెప్పాలి. అక్క‌డ మ‌హిళ‌లు న‌గ్నంగా పూజ చేస్తార‌ట‌. మ‌రి ఆ వివ‌రాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్‌లోని పిని అనే చిన్న గ్రామం. చూడ‌టానికి చిన్నదే అయినా గుర్తింపు దేశవ్యాప్తంగా ఉంది.. కారణం.. ఈ వింత ఆచారమే. ఈ గ్రామంలో మొత్తం జనాభా 2,593 మంది. ఇక్కడకు తరచూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. అలా వచ్చేవారు ఈ ఆచారం గురించి తెలుసుకొని షాక్ అవుతుంటారు… అక్కడి వారు చెప్పే కథేంటంటే.. పూర్వం ఇక్కడ లాహు ఘోండ్ దేవత ఉండేదట. ఆమె రాక్షసుల్ని చంపి… ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజులపాటూ ఈ నగ్న దీక్షను చేపడుతున్నారు మహిళలు

ఐదు రోజుల దీక్షలో భాగంగా మహిళలు తాము రోజూ కట్టుకునే బట్టలేవీ కట్టుకోరు. పూర్తిగా నగ్నంగా ఉంటారు. అంతేకాదు. ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంట్లోని భర్త, భార్య ఎవరూ నవ్వకూడదు. అలా నవ్వితే దేవతకు ఆగ్రహం వస్తుందని వారి నమ్మకం. అందువల్ల నవ్వకుండా జాగ్రత్త పడతారు. ఏటా భాద్రబ్ నెలలో ఐదు రోజులు వేడుకలు జరుపుతారు. వేడుకల మొదటి రోజునే దేవత రాక్షసుల్ని చంపేసిందట. అయినప్పటికీ ఐదు రోజులు వేడుకలు చేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో మగవారు మద్యం తాగరు. ఆ గ్రామం వైపు బయటివారు ఎవరూ రారు. రానివ్వరు.పిని గ్రామం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలే ఉంటుంది. ఈ ఊరు హిమాలయ పర్వతాల్లోనే ఉంది. అలాంటి చోట బట్టలు లేకుండా నిమిషం ఉండటమే కష్టం. అలాంటిది ఐదు రోజులు నగ్నంగా ఉండటం అనేది కఠినమైన దీక్ష. అలాంటి దీక్షతోనే అమ్మవారి అనుగ్రహం పొందగలం అని స్థానికులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *