పదో తరగతి పాస్.. ఆర్బీఐలో ఉద్యోగాలు?
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల. కేవలం పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో 241 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనున్నది. పూర్తి వివరాల కోసం.. https://www.rbi.org.inలో తెలుసుకోవచ్చు. మొత్తం ఖాళీల సంఖ్య 241 కాగా.. రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇక 2021, జనవరి 1 నాటికి.. 25 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులు అయిఉండాలి. ఎస్సీ ఎస్టీలకు వయస్సులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానంలో.. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 80 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగెటివ్ మార్కింగ్, సెక్షనల్ కటాఫ్ ఉండదు.