పాట రాస్తున్న సీఎం కేసీఆర్.. దేనిపైనో తెలుసా..!
ఒక మంచి ఆలోచన.. ఎంతో మంది జీవితాలను మార్చుతుంది. ఒక మంచి పథకం.. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. అలాంటి పనే చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ప్రజలు అడగకముందే, ప్రతిపక్షాలు డిమాండ్ చేయకముందే పథకాలు రచించడం, అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట. ఇలా ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు భీమా, కేసీఆర్ కిట్స్ వంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటిదే దళిత బంధు. దళితులను ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన పార్టీలు, నాయకులు తలదించుకునేలా సీఎం కేసీఆర్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దళితులు మార్వాడీలుగా ఎదుగాలనే ఆకాక్షంతో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. నచ్చిన వ్యాపారం, వచ్చిన ఉపాధి ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమాచారం మేరకు దేశంలోనే ఇలాంటి పథకం మరెక్కడా అమలు కావడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనూ ఇలా దళితులకు పెద్ద పేఠ వేయడం ఎన్నడూ లేదు. తనకు ఇష్టమైన ఈ పథకాన్ని ప్రజల్లో మరింత తీసుకుపోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్ స్వయంగా పాటలు రాస్తున్నారు. దళిత బంధు పాటలు.. ఇన్నాళ్ల అంధకారం తొలగించేలా ఉంటాయని టీఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమా కోసం గారడి చేస్తుండ్రు.. పాట రాసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు దళిత బంధు కోసం పాటలు రాయడం మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.