పురుగుల మందు..పెయింట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..

పంట పొలాలకు పురుగుల మందు కొడుతుంటారని తెలిసిన విషయమే..అంతేకాదు గోడలకి పెయింటింగ్ కూడా వేస్తుంటారు..అయితే వాటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 9 లక్షల మంది పెయింట్స్ అలాగే, పురుగుమందుల కారణంగా అకాల మరణాల పాలవుతున్నారు. పెయింట్స్ , పురుగుమందుల ద్వారా పెరిగిన వాయు కాలుష్యం కణాలు మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ కణాల కారణంగా, ప్రతి సంవత్సరం 3.4 లక్షల నుండి 9 లక్షల మంది అకాలంగా మరణిస్తున్నారు. పరిశోధకుడు బెంజమిన్ నాల్ట్ మాట్లాడుతూ, ఈ సంఖ్య అంచనా వేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అన్నారు.గతంలో జరిపిన పరిశోధన ప్రకారం, కాలుష్య కణ పదార్థం (పిఎమ్ 2.5) ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 నుండి 4 మిలియన్ల మరణాలకు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, చాలా దేశాలు తమ మార్గదర్శకాలను మార్చాయి. ఈ కణాలకు పరిమితిని నిర్ణయించారు. ఈ మార్గదర్శకాలు విద్యుత్ ప్లాంట్లు, డీజిల్ ఎగ్జాస్ట్ మరియు శిలాజ ఇంధనాల నుండి సల్ఫర్, నత్రజని ఆక్సైడ్లను నియంత్రించడం గురించి వివరంగా చెప్పాయి. కానీ, కొత్త అధ్యయనం శుభ్రపరిచే, పెయింట్ ఉత్పత్తుల నుండి విడుదలయ్యే సేంద్రీయ ఏరోసోల్‌లను నియంత్రించడం గురించి చెబుతోంది. మీరు అలాంటి రసాయనాలను కలిగి ఉన్న ఉత్పత్తులకు దూరంగా ఉంటే, మీరు కూడా మరణ ప్రమాదాన్ని పెంచే వనరులకు దూరంగా ఉన్నట్లే అని పరిశోధకుడు బెంజమిన్ చెప్పారు.శాస్త్రవేత్తలు గత 2 దశాబ్దాలుగా ఉద్గారాలపై 11 వేర్వేరు పరిశోధనలను అధ్యయనం చేశారు. ఈ పరిశోధన బీజింగ్, లండన్, న్యూయార్క్‌లో జరిగింది. కలప, బొగ్గును కాల్చడం, ఇళ్లలో రసాయన పెయింట్స్ తయారు చేయడం అదే విధంగా ఎక్కువ రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం వంటి మానవ కార్యకలాపాలు చెడు ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలో వెల్లడైంది. వీటి కారణంగా, అలాంటి ఏరోసోల్స్ గాలికి చేరుకుని నష్టాన్ని కలిగిస్తాయి.అభివృద్ధి చెందిన దేశాలలో తీసుకుంటున్న చర్యలతో ఇటీవల కాలంలో కొద్దిగా ఈ ప్రమాదకర ఏరోసోల్స్ నియంత్రణ జరిగింది. కానీ, అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో వీటిపై అవగాహనా.. నియంత్రణ లేదు. ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో రైతులు ఇప్పటికీ పురుగుమందులు తమ పంట పొలాలపై వెదజల్లుతున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోరు. దీనివలన వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ విషయంలో వారికీ అవగాహన కలిపించడం పెద్దగా జరగడం లేదనే పరిశోధకులు చెబుతున్నారు. పెయింట్స్, పురుగుమందుల ఏరోసోల్స్ చాలా ప్రమాదకారులని..వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని లేకపోతే మరింత చేటు జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *