పులిని హలో బ్రదర్ అంటూ విష్ చేసిన వ్యక్తి..వైరల్ గా వీడియో

మనిషి అనేవాడు ఎవరైనా సరే పులిని చూస్తే పరుగో పరుగు పెడతాం..కానీ ఇక్కడ ఒక అతను పులిని హలో బ్రదర్ అని సంభోదిస్తూ విష్ చేయడం వైరల్ గా మారింది..వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా కొంతమంది ఔత్సాహికులు ఏదైనా అడ్వెంచర్ చేయాలని ఆత్రుత పడుతుంటారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అలాంటి చర్యలు చూడటం, లేదా నమ్మడం చాలా కష్టం. తాజాగా ఓ వ్యక్తి పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ అంటూ చెప్పాడు. దానికి ఆ పులి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే. పులి వేట మాములుగా ఉండదు. దానికి సంబంధించిన పలు వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏదైనా జంతువును పులి చూసిందంటే.. దానిని ఖచ్చితంగా వేటాడి తీరుతుంది. అలాంటిది ఓ వ్యక్తి పులికి ఎడురెళ్ళాడు. దానికి ‘ఐ కాంటాక్ట్’ వరకు వచ్చి ‘హలో బ్రదర్’ అంటూ తనను పరిచయం చేసుకున్నాడు. మీరు వీడియో చూసినట్లయితే.. రైల్వే ట్రాక్.. రెండు వైపులా.. ఒక వైపు పులి.. మరో వైపు మనిషి ఉన్నట్లు అర్ధమవుతుంది. ఆమడదూరంలో నుంచి ఆ పులికి మనిషి సవాల్ విసిరాడు. అతన్ని చూస్తేనే పులి అక్కడే నిల్చుంది. తప్పితే దాడికి మాత్రం దిగలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, లఖింపూర్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు టికోనియా అటవీ ప్రాంతం సమీపంలో ఈ పులి నలుగురిని వేటాడిందని చెబుతున్నారు. అలాంటి పరిస్థితులలో టైగర్‌తో ఇలా పరచాకలు ఆడటం ప్రమాదకరం. ఈ వీడియోను నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *