పెట్రో ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌.. సైకిల్ పై పార్ల‌మెంట్ కి చేరుకున్న‌రాహుల్..ప్రతిపక్షాల నేతలు..!

రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. ఆయ‌న పిలుపు మేర‌కు ప్ర‌తిప‌క్షాల నేతలు కూడా సైకిళ్లు తొక్కుకుంటూ పార్ల‌మెంట్ కి చేరుకోవ‌డం విశేషం. ఇంత‌కీ రాహుల్ సైకిల్ తొక్కాల‌ని పిలుపు ఎందుకు ఇచ్చారో తెలుసా..పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా పార్లమెంట్ కు సైకిళ్ళ పై వచ్చి నిరసన తెలపాలని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చారు రాహుల్. ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించిన రాహుల్ గాంధీ.విపక్షాలన్నీ ఐకమత్యంగా ఉండాలని.. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. రాహుల్ అల్పాహార విందుకు ఆప్, బీఎస్పీ లు మినహా టీఎంసీ, ఎన్సీపీ, శివసేన,ఆర్జేడీలతో సహా మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. విపక్షాలను అల్పాహార విందుకు ఆహ్వానించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..”పెగసస్” సాఫ్టువేర్‌ను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిందా అని ప్రశ్నించారు. పెగసస్ పై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్ష నేతలతో కలిసి రాహుల్ వ్యూహాలు రచిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ సమావేశం తరువాత రాహుల్ గాంధీతో పాటు ఎంపీలంతా సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్ కు బయలుదేరారు.కాగా రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడుగా ఉన్న మల్లికార్జున ఖార్గే కు ఫోన్ చేసి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని రక్షణ మంత్రి రాజనాథ్ కోరారు. పార్లమెంట్ లో చర్చలకు ప్రభుత్వం అంగీకరించాలని కోరారు.కాగా..పార్లమెంట్ ను “పెగసస్” సెగలు పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు పార్లమెంట్ లో దీనికి సంబంధించి వేడి రాజుకుంటోంది. పెగసన్ తో పాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, అదుపులో లేని పెట్రోధరలు, దేశంలో “కోవిడ్-19” నిర్వహణ లాంటి అంశాలపై చర్చకు పట్టు ప‌డుతున్నాయి ప్రతిపక్షాలు. పెగసస్ కుంభకోణం పై పార్లమెంట్ లో చర్చించాల్సిందేనంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రంపై విపక్షాలంతా మూకుమ్మడిగా పోరాటం చేయాలని ఈ సమావేశంలో విపక్ష ఎంపీలు నిర్ణయం తీసుకొన్నాయి. దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు విపరితంగా పెరిగాయి. కేంద్రంతో పాటు , రాష్ట్రాలు పన్నులు వేయడంతో పెట్రోల్ ధరలు లీటరుకు వంద రూపాయాలు దాటాయి.పెగాసెస్ అంశాన్ని విపక్షాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దేశంలోని విపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు, జర్నలిస్టులు, కేంద్రమంత్రుల ఫోన్లను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా హ్యాక్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయమై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంతో విపక్షాలు సంతృప్తి చెందడం లేదు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎలాగైనా స‌రే ఇరుకున పెట్టేందుకు విప‌క్షాలు ప‌న్నాగాలు ప‌న్నుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *