పెరుగనున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని పెంచనుంది. ప్రస్తుతం ఇస్తున్నరూ.6 వేల ఆర్థిక సాయంతో సరిపోవడం లేదని కేంద్రం భావిస్తున్నది. రూ.6 వేల సాయాన్ని రూ.10 వేలకు పెంచేందుకు సన్నద్ధం అవుతున్నది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది.