ప్రపంచంలోనే లోతైన స్విమ్మింగ్ ఫూల్..ఎక్కడో తెలుసా..

స్విమ్మింగ్ పూల్ లోతు మహా అయితే ఎంత వుంటుంది..ఆరు అడుగులు..లేదా ఏడు అడుగులు..కానీ ఓ స్విమ్మింగ్ పూల్ ఏకంగా 196అడుగుల లోతులో వుందట..ఎక్కడ అనుకుంటున్నారా.. ఏం చేసినా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే దుబాయ్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించింది. డీప్ డైవ్ దుబాయ్‌గా పిలుస్తున్న ఈ పూల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఈ నెల 7న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ హ‌మ్‌దాన్ బిన్ మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తౌమ్ దీనిని ప్రారంభించారు. ఆయ‌నే ఓ వీడియోను కూడా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ డీప్‌డైవ్ దుబాయ్ స్విమ్మింగ్ పూల్ లోతు 60 మీట‌ర్లు (196 అడుగులు). దీనిని ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన పూల్‌గా గిన్నిస్ బుక్ గుర్తించింది. దీనికి సంంధించిన ప్రెస్ నోట్ దుబాయ్ ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. ఈ 60 మీట‌ర్ల లోతైన పూల్‌.. 1.4 కోట్ల లీట‌ర్ల నీటిని నింప‌వ‌చ్చు. అంతేకాదు ఈ పూల్‌లోప‌ల ఓ న‌గ‌రం కూడా ఉంది. ఓ పూర్తిస్థాయి అపార్ట్‌మెంట్‌, గ్యారేజ్‌, ఆర్కేడ్ కూడా ఇందులో ఉన్నాయి. ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ చేయాల‌నుకునే వారికి సాయం చేయ‌డానికి అక్క‌డ ఇంట‌ర్నేష‌న‌ల్ డైవింగ్ ప్రొఫెష‌న‌ల్స్ కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *