ప్రపంచలోనే అతి చిన్న సామ్రాజ్యం..రాజు ఎవరో తెలుసా..

సామ్రాజ్యం అంటే పెద్ద పెద్ద దేశాలను అంటూవుంటాం..ఎందుకంటే ఎంతో విశాలంగా వ్యాపించి ఉన్నవాటినే సామ్రాజ్యం అని పిలుచుకుంటాం కానీ .. ప్రపంచలోనే అతి చిన్న సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం.దీనిలో కేవలం 11 మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ రాజే స్వయంగా పడవ నడుపుతారు. ఆయనకు రెస్టారెంట్ కూడా ఉంది.ఇక్కడ రాజు నిక్కర్ వేసుకుని మామూలు చెప్పులతో తిరుగుతుంటారు. ఈ సామ్రాజ్యం పేరు టవోలారా. ఎన్నో ఆసక్తికర విశేషాలకు ఈ రాజ్యం నిలయం.మధ్యధరా సముద్రంలో ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు సమీపంలో టవోలారా దీవి ఉంది.టవోలారా అనే చిన్న నగరం చుట్టూ టవోలారా సామ్రాజ్యం విస్తరించి వుంటుంది. ఈ దీవి విస్తీర్ణం ఐదు చ.కి.మీ.ఈ సామ్రాజ్య చక్రవర్తి పేరు ఆంటోనియో బర్తలివోనీ.మీరు ఎప్పుడైనా టవోలారాకు వస్తే, ఆంటోనియోను గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చక్రవర్తిలా కనిపించరు. ఆయన బట్టలు కానీ, ఆయన జీవిన శైలి కానీ.. ఏదీ రాజులా కనిపించదు. ఇక్కడ రాజుకు కేవలం ఉచితంగా ఆహారం మాత్రమే లభిస్తుందని ఆంటోనియో చెబుతున్నారు.టవోలారాలానే ప్రపంచంలో మరికొన్ని చిన్న దేశాలు, సామ్రాజ్యాలు ఉన్నాయి.రెడోండా: ఇంగ్లండ్‌లోని సౌథంప్టన్‌లో ఈ ప్రాంతం ఉంది. పొగాకుపై నిషేధం నుంచి తప్పించుకోవడానికి రెడోండాను స్థానికులు ప్రత్యేక దేశంగా ప్రకటించారు. రెడోండాలో దాదాపు వంద మంది పౌరులు ఉంటారు.టోంగా: పసిఫిక్ మహా సముద్రంలో ఈ దేశం ఉంది. దీని విస్తీర్ణం 748 చ.కి.మీ. ఈ దేశంలో 1.6 లక్షల మంది జీవిస్తున్నారు. 1773లో బ్రిటన్‌కు చెందిన జేమ్స్ కుక్ ఈ దీవిని కనుగొన్నారు. దీనికి ఫ్రెండ్లీ ఐలండ్‌గా జేమ్స్ కుక్ నామకరణం చేశారు.బ్రూనై: ఇది ఆగ్నేయాసియాలో ఉంటుంది. దీని విస్తీర్ణం 5,765 చ.కి.మీ. ఇక్కడ 4.13 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడి ప్రజలపై ఎలాంటి పన్నులూ ఉండవు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బ్రూనై సుల్తాన్ కూడా ఒకరు.స్వాజీలాండ్: ఇది ఆఫ్రికాలో ఉంటుంది. దీని విస్తీర్ణం 17,360 చ.కి.మీ. మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు ఈ దేశం నిలయం. దీని జనాభా దాదాపు 13 లక్షలు.లెసోతో: ఇది దక్షిణాఫ్రికాలో ఉంటుంది. దీని విస్తీర్ణం 30,000 చ.కి.మీ. ఇక్కడ 20 లక్షల మంది జీవిస్తున్నారు.టవోలారా 180వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇంత చిన్న దీవిని సామ్రాజ్యం అంటుంటే మనకు నవ్వొస్తూ ఉండొచ్చు.కానీ తమది రాజ్యమేనని ఆంటోనియో, ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. దీని వెనుక పెద్ద కథ ఉందని వారు వివరిస్తున్నారు.ఆంటోనియో ముత్తాతకు ముత్తాత గుసెప్పే 1807లో ఇటలీ నుంచి ఇక్కడకు పారిపోయివచ్చారు. అప్పట్లో ఇటలీ ఇంకా దేశంగా ఏర్పడలేదు. సార్డీనియా మాత్రం ప్రత్యేకమైన రాజ్యంగా ఉండేది. ఇక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని నేరంగా పరిగణించేవారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న గుసెప్పే.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు టవోలారాకు పారిపోయి వచ్చేశారు.టవోలారాలో బంగారం వర్ణంలో పళ్లుండే మేకలు ఉంటాయి. ఇలాంటి మేకలు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉండేవని అప్పట్లో ప్రజలు చెప్పుకునేవారు.ఈ మాటలు అప్పటి సార్డీనియా చక్రవర్తి చార్లో ఆల్బెర్టో చెవిన పడ్డాయి. దీంతో ఈ మేకల్ని వేటాడేందుకు ఆల్బెర్టో టవోలారాకు వచ్చారు.1836లో ఇక్కడకు వచ్చిన ఆల్బెర్టోకు గుసెప్పే కుమారుడు పవోలో సాయం చేశారు. దీంతో ఈ దీవి మొత్తం తిరిగి ఆల్బెర్టో మేకల్ని వేటాడారు.ఇక్కడకు వచ్చినప్పుడు తాను సార్డీనియా రాజునని ఆల్బెర్టో చెప్పారు. దీనికి స్పందనగా నేను టవోలారా రాజునని మా తాత చెప్పారు’’ అని ఆంటోనియో వివరించారు.టవోలారాకు చుట్టుపక్కల చాలా సముద్ర జీవులు నివసిస్తుంటాయి. వాటితో ఆడుకునేందుకు చాలా మంది పర్యటకులు వస్తుంటారు. వీరి కోసం ఆంటోనియో, తన మేనల్లుడు పడవ నడుపుతున్నారు. మరో మేనల్లుడు చేపలు పట్టి, పర్యటకులకు ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు.ఇక్కడకు వచ్చే పర్యటకులకు ఆంటోనియో రెస్టారెంట్‌లోని ఆహారమే ఆధారం. టవోలారాను పాలించడమనేది మా కుటుంబ వృత్తి లాంటిదని ఆంటోనియో చెబుతున్నారు.పర్యటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆంటోనియో ఆదాయం కూడా పెరుగుతోంది. కానీ, సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టమని ఆయన చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *