ప్రభాస్ తో శృతి రొమాన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కేజీఎప్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ క్రేజీ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. శృతిహాసన్ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు సలార్ మూవీలో తనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ప్రకటించాడు.
కొత్త అప్‌డేట్‌తో అటు ప్రభాస్ ఫ్యాన్స్.. ఇటు శృతి హాసన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలే శృతి నటించిన క్రాక్ హిట్ అవడం.. సౌత్ ఇండియాతోపాటు బాలీవుడ్‌లోనూ శృతికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో సలార్ కాంబో సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు.