ప్ర‌పంచంలోనే అతి చిన్న బేబీ-ఎక్క‌డో తెలుసా..!

ప్రపంచంలోనే అతి చిన్న బేబీ పేరు క్వెక్ యూ షువాన్. కాగా ఈ చిన్నారి జన్మించినపుడు కేవలం 212 గ్రాముల బరువే ఉంది. ఓ చిన్న యాపిల్ బరువున్న ఈ బేబీ 24 సెంటిమీటర్ల పొడవే ఉంది. ఈ పాప ప్రస్తుతం ఇంటికి చేరుకుంది. సింగపూర్ ఆస్పత్రిలో పదమూడు నెలలు ట్రీట్‌మెంట్ పొంది ఆరోగ్యంగా పేరెంట్స్ వద్దకు వెళ్లింది. ఈ చిన్నారి తల్లి గర్భంలో కేవలం 25 వారాలే ఉందట. సాధారణంగా 40 వారాల పాటు శిశువు మాతృమూర్తి గర్భంలో ఉండాలి. కానీ, ఇమె అందుకు భిన్నంగా ముందే బయటకు వచ్చేసింది. పుట్టినపుడు అతి తక్కువ బరువున్న షువాన్ 13 నెలల తర్వాత 6.3 కేజీలు అయింది. ఈ చిన్నారి బర్త్ సమయంలో బతికే అవకాశాలు చాలా తక్కువని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో డాక్టర్స్ భావించారు. అయితే, పాప చికిత్సకు స్పందించడంతో ఒక్కొక్కటిగా అన్ని హెల్త్ ఇష్యూస్‌ను అధిగమించింది. ఈ శిశువు ఇతర చిన్నారులకు ఆదర్శమని ఈ సందర్భంలోనే సింగపూర్ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్స్ చిన్నారి షువాన్‌కు వైద్యం అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైద్యులు రకరకాల మెషిన్స్ ఉపయోగించారు. మొత్తంగా బేబీ ఇప్పుడు హెల్దీగా ఉండటం చూసి డాక్టర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇకపోతే షువాన్ పుట్టినపుడు అంత చిన్నగా ఉండడం చూసి షాక్ అయినట్లు పాప తల్లి వాంగ్ మీ లింగ్ చెప్పుకొచ్చారు. షువాన్‌కు హాస్పిటల్‌లో చికిత్స అందించేందుకుగాను పాప తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.2.72 కోట్లకు పైనే సేకరించి ఆస్పత్రికి చెల్లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *