ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య డెలివరీ..ఎక్కడో తెలుసా..
డబ్బులున్నాయి,గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. అయినా ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి తన భార్య డెలివరీని జరిపించారు ఓ కలెక్టర్. తన భార్యను సామాన్యుడిలా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ భార్య పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాచలం లో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన సేవలతో.. ఇప్పటికే ప్రజల మనసుని దోచుకున్నారు. ఇప్పుడు ఓ సామాన్యుడి జీవితానికి మరింత దగ్గర చేస్తూ అనుదీప్ ప్రవర్తన పదిమందికి ఆదర్శంగా నిలిచింది.. తాజాగా ఇతను తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి, ఇటు ప్రభుత్వ ఆస్పత్రులపైన, ప్రభుత్వ అధికారులపైన ప్రపజలకు నమ్మకం కలిగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ గర్భిణి అయిన అతని భార్య మాధవిని ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా కలెక్టర్..ఆయన తలచుకుంటే పెద్ద పెద్ద కార్పోరేట్ ఆసుపత్రిల్లో చేర్పించవచ్చు..కానీ ఒక సామాన్యుడిలా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు.. ఆయన భార్య మాధవిని మొదటి కాన్పు కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా నవంబరు 09 అర్ధరాత్రి 1.16 ని.లకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.