ప్లాస్టిక్ బ్యాగ్ రూ 5ల‌క్ష‌ల పై మాటే-ఎందుకో తెలుసా..!

టాలీవుడ్ మాటేమోగాని..హాలీవుడ్ లో మ్యూజిక్ షోస్ విప‌రీతంగా జ‌రుగుతుంటాయి. ఆ షో ల‌లో పాడే సింగ‌ర్స్ కి ఎన‌లేని క్రేజ్ ఉంటుంది. అందుకే ఆ క్రేజ్ ను క‌రెక్ట్ గా ఉప‌యోగించుకున్నాడు ఓ వ్య‌క్తి..ఆ క్రేజ్ వ‌ల్ల ఆ వ్య‌క్తికి రూ.5ల‌క్ష‌ల 65వేలు లాభాన్ని అందించాయి. ఎలా అనుకుంటున్నారా..వివ‌రాల్లోకి వెళ్ళితే..చిన్న పిల్లలు అడుకునేందుకు ఉపయోగించే బెలూన్ ధర మహా అయితే 5 రూపాయలకు మించి ఉండదు. ఐదురూపాయల పెట్టి బెలూన్ కొనుగోలు చేసి దీంతో ఏంచక్కా పిల్లలు గాలి ఊదుకుని అడుకుంటుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం గాలితో నింపబడ్డ ప్లాస్టీక్ బ్యాగ్ ధర 5.65లక్షల రూపాయలు పలుకుతుంది. ఆశ్ఛర్యపోతున్నారా.. అవును నిజమే.. కాన్నే వెస్ట్ అనే బ్రాండ్ తన చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ ధర ను ఇంత పెద్ద మొత్తంలో నిర్ణయించింది. అసలు ఇంతకీ బ్యాగ్ కు అంత నిర్ణయించటానికి కారణమేంటి.. అందులో ఏముందంటే.. అట్లాంటా దోండా లిజనింగ్ మ్యూజిక్ ఈ వెంట్ ను కాన్వే వెస్ట్ సంస్ధ ఇటీవలే అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో నిర్వహించింది. దోండా మ్యూజిక్ ఆల్బమ్స్ అంటే చాలా మంది పడిచస్తారు. ఆయన మూజిక్ కోసం వేలాది మంది ఈ వేంట్ లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ వెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన వారిలో ఒక అభిమాని తన వద్ద ఉన్న జిప్ లాక్ ప్లాస్టిక్ బ్యాగ్ లో గాలినింపాడు. గాలి నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ ను ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఈ బేలో అమ్మకానికి పెట్టాడు. ఎయిర్ ఫోమ్ దోండా డ్రాప్ అనే టైటిల్ ను అమ్మకానికి ఉంచిన బ్యాగ్ కు పెట్టాడు. దాని ప్రారంభధరను ధరను 3,330 డాలర్లు, అనగా, 2లక్షల 24వేల రూపాయలుగా నిర్ణయించి వేలానికి ఉంచాడు. ప్లాస్టీక్ బ్యాగ్ లో నింపబడిన గాలి దోండా లిజనింగ్ ఈవెంట్ సమయంలో నింపిన గాలిగా నిర్ధారించేందుకు వీలుగా ఈ వెంట్ సమయంలో ప్లాస్టిర్ బ్యాగ్ పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. వేలం పాటకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ను సొంతం చేసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. పెద్ద సంఖ్యలో వేలంలో పాల్గొన్నారు. చివరికి కాన్యే వెస్ట్ అభిమానుల్లో ఒకరు 7,600 డాలర్లు అనగా అక్షరాల 5లక్షల,65,000రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు.ఇదిలా వుంటే కాన్యే వెస్ట్ ఈ వెంట్స్ నుండి ఐదు సంవత్సరాలుగా ఈ తరహా ఎయిర్ బ్యాగ్ ల అమ్మకాలు సాగుతున్నాయి. ఇవన్నీ ఆన్ లైన్ ద్వారానే అమ్ముతున్నారు. కొనుగోలు దారులకు ఫ్రీ షిప్పింగ్ ఉండదు. షిప్పింగ్ కోసం కొనుగోలు దారులే నాలుగు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. గాలితో నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ లకు ఇంత క్రేజ్ ఉండటాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *