బంగారు పూతతో లగ్గరీ కారు..వైరల్ అవుతోన్న వార్త..

ఇప్పుడు కారు కొనడం అంటే చాలా ఈజీ అనే చెప్పాలి..అతి తక్కువ ధర నుంచి కాస్ట్ లీ కారు వరకు ఎన్నో కారులు అందుబాటులో ఉన్నాయి. అయితే కారును కొందరు సౌకర్యం కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు హోదా కోసం కొంటూ ఉంటారు. హోదా కోసం కొనేవారు ఎక్కువగా లగ్జరీ కార్లను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తారు. అయితే, వారు అంతటితో సంతృప్తి చెందరు. ఆ కారుకు మరిన్ని హంగులు కావాలని కోరుకుంటారు. ప్రముఖ వానిజ్య దిగ్గజం ఆనంద్ మహీంద్ర పోస్టు చేసిన వీడియోలోని వ్యక్తి కూడా అలాంటి వాడే. ఖరీదైన లగ్జరీ ఫెరారీ కారును కొనుగోలు చేయడమే కాకుండా.. దానికి పూర్తిగా బంగారంతో కోటింగ్ ఇచ్చాడు.ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్‌తో ఇండియన్-అమెరికన్’ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఆ వ్యక్తి మిలమిలా మెరిసిపోతున్న తన బంగారు ఫెరారీలో కారులో కూర్చుంటే.. అటుగా వెళ్తున్నవారు నోరెళ్లబెట్టి మరీ చూస్తుండిపోయారు. కొందరు ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రను బాగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా మహీంద్ర తన ట్విట్టర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘ఈ వీడియో సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుందో తెలీదు. కానీ, మీరు ధనవంతులైతే డబ్బును ఎలా ఖర్చు చేయకూడదని చెప్పేందుకు మాత్రం ఇది మంచి పాఠం’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, నెటిజనులు దీనిపై భిన్న విధాలుగా స్పందిస్తున్నారు.అది పూర్తిగా బంగారంతో తయారైన కారు కాదని ‘ఫెరారీ 458’ స్పైడర్ కన్వర్టబుల్ వెర్షన్ కారని నెటిజనులు అంటున్నారు. ఇలాంటి కారును అప్పట్లో ఇరాక్‌కు చెందిన వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ రియాజ్ అల్ అజావీకి ఉండేదని తెలుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో అతడు తన కారు గురించి చెబుతూ.. అది బంగారం కాదని, గోల్డ్ కలర్ వ్రాపర్ అని తెలిపాడు. ఈ నేపథ్యంలో కొందరు మహీంద్ర ట్వీట్‌ను ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆయన మాటలను అంగీకరిస్తున్నారు. డబ్బులను అనవసరంగా పాడుచేస్తున్నారని, అది పేదలకు విరాళంగా ఇవ్వొచ్చు కదా అని అంటున్నారు. మరికొందరు మాత్రం అది గోల్డ్ కాదని, మీరు పొరబడుతున్నారని తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *