బామ్మతో లవ్ లో పడ్డ యువకుడు..తర్వాత ఏం జరిగింది..!
ఆమెకు 61.. ఆయనకు 24 .. వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు ఇది సినిమాటైటిల్ కాదండోయ్ నిజమే. ఆ వివరాలు చూద్దాం. ఆ బామ్మ పేరు చెరిల్. వయసు ముందే చెప్పుకున్నాం కదా.. 61 సంవత్సరాలు. ఆమెకు 17 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినప్పటికీ.. ఈ వయసులో తను ఓ తోడు కావాలనుకుంది. అందుకే.. ఓ యువకుడి ప్రేమలో పడింది. ఇక.. తన ప్రియుడి పేరు మెక్ కెయిన్. అతడికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే.. తనతో పరిచయం ఏర్పడిందట. కాకపోతే.. అప్పుడు వాళ్ల మద్య ప్రేమ చిగురించలేదు. తర్వాత వాళ్లలో ప్రేమ మొదలైంది. ఇద్దరూ కలిసి.. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఉండేవారట. ఏదో టైమ్‌పాస్ కోసం కెయిన్.. చెరిల్ తో ఎక్కువ సమయం గడుపుతుండేవాడు. కాసేపు ఇద్దరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకునేవారు. చెరిల్‌ను ఎవరైనా ఏదైనా అంటే.. కెయిన్.. తట్టుకునేవాడు కాదు. చెరిల్‌ను తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కెయిన్ చూసుకునేవాడు. తన కేరింగ్ నచ్చి.. చెరిల్ అతడి ప్రేమలో పడిపోయింది.ఇప్పుడు ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ కలిసే ఉంటున్నారు. వాళ్ల ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అడ్డు చెప్పలేదు. దీంతో.. ఇద్దరూ ఒక్కటైపోయారు. అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఓన్లీ ఫ్యాన్స్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేసి.. వాళ్లు హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలను తమ అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య 37 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా.. తమ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.