బార్క్ లో 63 ఉద్యోగాలు

బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్- BARC పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 160 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఇప్పుడు మరో 63 పోస్టుల భర్తీకి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలచేసింది. ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్- BARC, కోల్‌కతాలోని రేడియేషన్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్- RMRC లో ఈ ఖాళీలున్నాయి. స్టైపెండరీ ట్రైనీ, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు http://www.barc.gov.inలో చూడొచ్చు. అభ్యర్థులు https://recruit.barc.gov.inలో దరఖాస్తు చేయాలి.
మొత్తం ఖాళీలు- 63
మెడికల్, సైంటిఫిక్ ఆఫీసర్ ఈ (న్యూక్లియర్ మెడిసిన్)- 1
మెడికల్, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 2
టెక్నికల్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 1
నర్స్ ఏ- 19 సబ్ ఆఫీసర్ బీ- 6
సైంటిఫిక్ అసిస్టెంట్ సీ (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 7
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (ప్యాథాలజీ)- 2
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 2
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (రేడియోగ్రఫీ)- 1
ఫార్మాసిస్ట్ బీ- 1
డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్ ఏ- 11
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ 1 (కంప్యూటర్ ఆపరేషన్)- 1
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ 1 (హెల్త్ ఫిజిస్ట్)- 1
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ 2 (ల్యాబరేటరీ టెక్నీషియన్)- 5
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ 2 (డెంటల్ టెక్నీషియన్ హైజీనిస్ట్)- 3

దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.500
ఎంపిక విధానం- రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
అభ్యర్థులు ముందుగా https://recruit.barc.gov.in ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో New User? Register క్లిక్ చేయాలి.
మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
ఆ తర్వాత లాగిన్ చేసి జాబ్ అప్లికేషన్ సెలెక్ట్ చేయాలి.
Apply Online పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో పూర్తి చేయాలి.
చివరగా ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *