బాలుడి విన్యాసాలు.. మంత్రి కేటీఆర్ ఫిదా.. తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్
ఓ బాలుడు జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో గాలిలో పల్టీలు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ బాలుడి వీడియోను చూశారు. ఆ బాలుడి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉందని.. ఇది తనకు సండే మోటివేషన్ గిఫ్ట్ అని.. అతడి గురించి తెలిస్తే చెప్పాలని ట్వీట్ చేశారు. అతడిని ప్రోత్సహిస్తే.. తప్పక ఒలంపిక్ పతకాన్ని తీసుకువస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
‘వావ్ ఒలంపిక్ మెడలిస్ట్ తయారవుతున్నాడు. అతడు తెలంగాణ బాలుడా? లేక దేశంలోని ఇతర ప్రాంతానికి చెందినవాడా? గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్సహించాలనుకుంటున్నా’ అని కేటీఆర్ ఆ వీడియోను రీ ట్వీట్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ బాలుడు ఎవరా అని ప్రస్తుతం నెటిజన్లు తెలుసుకునే పనిలో పడ్డారు.
Wow 🤩 an Olympic medalist in the making
Is he from Telangana or elsewhere in India? Would love to support this amazing talent https://t.co/tCeatdjxEB
— KTR (@KTRTRS) January 24, 2021