బావిలో చిక్కుకున్న 12అడుగుల ‘కింగ్ కోబ్రా’..త‌ర్వాత ఏం జ‌రిగింది..!

ప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు …ఎక్క‌డో చోట ఏవో వైర‌ల్ న్యూస్ లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడో వింత చోటు చేసుకుంది. ఓ బావిలో వింత శ‌బ్దాలు విని గ్రామ‌స్థులు హ‌డ‌లెత్తారట‌. ఓ పురాతన బావిలో భారీ నాగుపాము కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పామును రక్షించి సురక్షితప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖుంటా ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న బావిలో 12 అడుగుల కింగ్‌ కోబ్రా చిక్కుకుపోయింది. అనంతరం సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది.. దానిని బావిలోనుంచి బయటకు తీశారు. అనంతరం దానికి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం బాగుండటంతో దానిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. కింగ్ కోబ్రా పాము ఆగ్నేయాసియాలో సంచరించే అత్యంత విషమైన పాము. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము ఇదే. ఇది దాదాపు 6.7 మీటర్లు (22 అడుగులు) వరకు పెరుగుతుంది. సాధారణంగా దట్టమైన అరణ్యాలలో నివసించే ఈ రకమైన పాములు.. ఇతర పాములను ఆహారంగా తింటాయి. దాని విషం తీవ్రత ఎలాఉంటుందంటే.. ఒక్క కాటుతోనే మనుషులను చంపగలదు. ఈ పాము కాటేస్తే.. మరణాల రేటు 75% వరకు ఉంటుందని నిపుణులు తెలిపారు. కాగా.. పామును చూసేందుకు గ్రామస్థులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. భారీ పామును చూసి వారు ఒక్కసారిగా భయపడినట్లు గ్రామస్థులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *