బుగాటీ కారు..ధర ఎంతో తెలుసా..

ఎవరి తాహత్తును బట్టి ఎవరికి వారు తమకు నచ్చిన కార్లను కొనుకుంటారు..కారు కొనుక్కోవడం వేరు లగ్జరీ కారు కొనడం వేరు. లగ్జరీ కారులో కూర్చుంటే ఆ కిక్కే వేరప్ప.మరి లగ్జరీకి అంతు ఉంటుందా.. అంటే.. ఖచ్చితంగా ఉండదని చెప్పొచ్చు. ఉదాహరణ కావాలంటే.. కార్ల తయారీ దిగ్గజం బుగాటీ లేటెస్ట్ మోడల్ ను చూపించొచ్చు. ఇప్పటి వరకు చాలా మందికి బీఎండబ్ల్యూ బెంజ్ రాయల్టీకి సింబల్ గా ఉండేవి. ఆ తర్వాత లాంబోర్గినీ వంటి మోడల్స్ హవా కొనసాగించాయి. ఇంకా ఎన్నో మోడళ్లు ఇప్పటికీ తమ తమ స్థాయిలో సత్తా చాటుతూనే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు మనం చెప్పకోబోతున్న ‘బుగాటీ’ లేటెస్ట్ మోడల్ ను చూస్తే దిమ్మ తిరుగుతుంది. ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. అవును.. దీని ధర అక్షరాలా రూ.100 కోట్లు మరి.ఫ్రాన్స్ కు చెందిన ఈ ప్రఖ్యాత కార్ల కంపెనీ.. 100 కోట్ల విలువ చేసే కారును తయారు చేస్తామని చాలా కాలంగా చెబుతోంది. చెప్పడమే కాదు.. చేసి చూపించింది కూడా. తద్వారా కార్ల ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. ఈ కారు మోడల్ పేరు La Voiture Noire. ప్యూర్ బ్లాక్ లో ఉన్న ఈ కారును తనివితీరా అలా చూస్తూనే ఉండాలనిపించేలా ఉంది.డాలర్ భాషలో చెప్పాలంటే 13.4 మిలియన్ డార్లు. మన కరెన్సీలో దాదాపు రూ.100 కోట్లు. దీన్ని తయారు చేయడానికి ఏకంగా 65 వేల గంటలు (వర్కింగ్ అవర్స్) పట్టిందట. మరి ఇన్ని కోట్లు పోసి కొనుక్కునే ఈ కారులో ఏమేం ఉంటాయన్నప్పుడు చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 1500 హార్స్ పవర్ తో దూసుకెళ్తుందీ కారు. 16 సిలిండర్లు నాలుగు టర్బో ఛార్జర్లతో రూపొందించారు. దీంతోపాటు.. ఇంకా ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. బుగాటీ కంపెనీ స్థాపించిన 110 సంవత్సరాలు పూర్తయిన ఈ కారును తయారు చేశారు. ఇప్పటికే పలు ఆర్డర్లు కూడా వచ్చినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *