బ‌త్తాయి జ్యూస్ తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు..

మోసంబి అదేనండి బ‌త్తాయి. ఈ జ్యూస్ తో ఆరోగ్యానికి ఎంతో మేల‌ట‌. ఆరోగ్యంతో పాటు అందం కూడా మ‌న సొంతమ‌వుతుంద‌ట‌. ఏదైనా అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి కోలుకున్న త‌ర్వాత అలసట, బలహీనతను తొలగించుకోవడానికి ఎక్కువగా మోసంబి జ్యూస్ తాగుతుంటారు. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే మోసంబి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిసుకుందాం.మోసంబిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేసవికాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా.. స్ట్రోక్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచుతుంది. అలాగే వికారాన్ని తగ్గిస్తుంది. నెట్‌మెడ్స్ నివేదిక ప్రకారం మోసంబిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం ద్వారా ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.విరేచనాలు, వాంతులు, వికారంగా ఉన్నప్పుడు మోసంబి జ్యూస్ తీసుకోవాలి. విటమిన్ సి లోపం ఉండడం వలన స్కర్వి వ్యాధికి దారితీస్తుంది. అంటే నోటిలో చిగుళ్ల వాపు, జలుబు, నాలుకపై పుండ్లు ఉంటాయి. మోసంబి రసంలో నల్ల ఉప్పు కలిపి చిగుళ్లపై రాస్తే సమస్యలను తగ్గిపోతాయి. అలాగే నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. మోసాంబిలో ఫ్లేవనాయిడ్స్ లిమోనేన్ గ్లూకోసైడ్ ఉండటం వలన క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పొరాడడమే కాకుండా.. అల్సర్, గాయాలకు చికిత్స చేస్తుంది. రక్క ప్రసరణను మెరుగు పరుస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మోసంబిలో ఉంటే యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక సౌందర్య సమస్యలను నివారిస్తాయి. ఇవి జుట్టు సమస్యలను, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు జుట్టును బలంగా చేస్తాయి. అలాగే చుండ్రు, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తద్వారా శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం లోపాన్ని తగ్గించడమే కాకుండా.. ఎముకలను బలంగా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను బలాన్ని పెంచుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *