భారత్ ఆలౌట్.. ఇంగ్లండ్ 1/1
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆటలో భాగంగా 95.5 ఓవర్లలో 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. 138 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్లతో మెరుగైన స్కోరు సాధించాడు. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను ముగించగా.. టీమిండియా ఇంకా 241 పరుగులు వెనుకబడి ఉంది. ఆదివారం మూడోరోజు ఆటలో పూజారా, పంత్ లు అర్ధ సెంచరీలు చేయగా, సోమవారం సుందర్ తొలి అర్ధసెంచరీ పూర్తిచేశాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఒపెనర్ బర్స్న్(0) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 1/1తో సిబ్లే (0), లారెన్స్ (0) క్రీజ్ లో ఉన్నారు.