భారత్ కి భారీ విరాళం..రూ.7400కోట్లు

భారత్ లోని కోవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. దాని నుంచి బయటపడేందుకు వీలుగా క్రిప్టో బిలియనీర్.. ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ భారతదేశానికి రూ.7400 కోట్ల భారీ భూరి మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు. తాజాగా తన సొంత క్రిప్టో కరెన్సీ అయినా 50 ట్రిలియన్ డాలర్లకు పైన షిబా ఇను కరెన్సీని దానం చేయటం సంచలనంగా మారింది. బిట్ కాయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదే తరహాలో బిట్ కాయిన్ తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ పేరు ‘‘ఏథీరియం’’.  దీని ధర మే10న ఒక్కొక్కటి 3000 డాలర్లు. దీంతో.. ఈ కరెన్సీ సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ ప్రపంచంలో అత్యంత చిన్న వయసులో క్రిప్టో బిలీయనీర్ గా మారిపోయాడు. భారత్ లోని కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అయితే.. భారత్ లో క్రిప్టో కరెన్సీ రద్దు కాలేదని పేర్కొన్నారు.ఇంత భారీగా విరాళాన్ని ప్రకటించిన వెంటనే.. గడిచిన 24 గంటల్లో షిబాఇను ధర 35 శాతం క్షీణించగా.. తాజాగా నష్టాల నుంచి రికవరీ కావటం గమనార్హం. బుటెరిన్ విరాళంపై భారత టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్ లో ఈ క్రిప్టో కింగ్ ప్రకటించిన తాజాగా విరాళం సంచలనంగా మారింది. దేశంలోని పరిస్థితుల్ని అర్థం చేసుకొని స్పందించినందుకు బుటెరిన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అంత చిన్న వయసులో ఇంత భారీ మొత్తాన్ని సాయంగా అందించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ.. ఈ క్రిప్టో కరెన్సీ ప్రభుత్వ ఖాతాలోకి విరాళం రూపంలో ఎలా జమ అవుతుందన్నది ఇప్పుడు అసలుసిసలు ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *