భారీ తిమింగళం..వైరల్ గా ఫొటో..

ఇప్పుడో ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటీ విషయం అంటే  అమెరికాకు చెందిన జాస్మిన్ చిల్డ్రెస్ అనే మహిళ విమానంలో ప్రయాణిస్తూ తిమింగలాన్ని గుర్తించింది. విమానంలో ప్రయాణిస్తుండగా కింద నీటిలో భారీ తిమింగలం కనిపించడంతో జాస్మిన్ వెంటనే ఫొటోలు తీసింది. ఈ ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. దాదాపు పది లక్షల మంది ఈ ఫొటోలకు లైక్ కొట్టారు. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న శాంటా బార్బరా ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో జాస్మిన్‌కు ఈ దృశ్యం కనిపించింది. ఈ ఫొటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నీలం రంగు తిమింగలాలు రెండు బస్సుల సైజులో ఉంటాయని, విమానంలో ప్రయాణిస్తున్నా ఇవి కంటికి కనిపిస్తాయంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గతంలో తాను కూడా విమానంలో ప్రయాణించే సమయంలో తిమింగలాన్ని గుర్తించానంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *