భారీ పేలుడు : 15 మంది మృతి
క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో 15 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అబ్బలగిరి గ్రామానికి సమీపంలోని హుసోడు జరిగింది. భారీ శబ్ధం రావడంతో స్థానిక ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 10.20 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలిసింది. పేలుడు ధాటికి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్ధం, భూమి కంపించినట్లుగా అన్పించడంతో ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. మృతులను, క్షతగాత్రులను బయటకు తీసేపనిలో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది.