భర్తకు గుడి..శని..ఆది వారాల్లో అన్నదానం..ఎక్కడో చూద్దాం..!
భర్త మరణంతో కుంగిపోయిన ఇల్లాలు తన భర్తకు గుడిని కట్టించాలనుకుంది. అంతేకాదు గుడిని కట్టించింది కూడా. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇన్నాళ్లూ భర్త అంకిరెడ్డిని స్మరించుకుంటూ గడుపుతూ వచ్చింది ఆమె. ఇక తన భర్తను రోజూ చూసుకోవాలనుకుంది.అంతే భర్త పాలరాతి విగ్రహం చేయించి ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూనే సమాజ సేవకులను సన్మానిస్తున్నారు. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది పద్మావతి. అలా భర్తను సేవిస్తూ తన ప్రేమను చాటుకుంటోంది.గతంలో తెలంగాణలో..నిమ్మవరం మాదిలే తెలంగాణలోని ఓ గ్రామంలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది. వికారాబాద్ జిల్లాలోనే బషీరాబాద్ మండలం నావల్గ గ్రామానికి చెందిన మొగులప్పకు సంతాన భాగ్యం కలగలేదు. తన తమ్ముడి మనవడైన ఈశ్వర్‌ను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశాడు. దత్తత వల్ల తండ్రైనా… వరుసకు పెదతాత అయిన మొగులప్పను ఈశ్వర్ ఎప్పుడూ తాత అనే పిలిచేవాడు. ఐతే… 2013లో మొగులప్ప చనిపోవడంతో… ఈశ్వర్ అస్సలు తట్టుకోలేకపోయాడు. ఒకేసారి తనకు తాత, తండ్రి చనిపోయినట్లుగా ఫీల్ అయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. రోజూ తాత జ్ఞాపకాలతో జీవించడం ప్రారంభించిన ఈశ్వర్… తనను పెంచి పెద్ద చేసిన తాతకు ఏదో ఒకటి చేసి… ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి అనుకున్నాడు. అప్పుడు వచ్చిందే ఈ టెంపుల్ ఆలోచన. సొంత భూమిలో రూ. 24 లక్షలు ఖర్చుపెట్టి భవ్య ఆలయం నిర్మించాడు.మహారాష్ట్రలోనూ ఇలాగే తమ తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను గుడి కట్టి పూజించడం ద్వారా చాటుకుంటున్నారు ముగ్గురు పిల్లలు. వారే దశరథుడు, ధనరాజ్, ధరనేష్. చనిపోయిన తమ పేరెంట్స్ విశ్వనాథ్, లక్ష్మీబాయ్‌ని గుడిలోని విగ్రహాల్లో చూసుకుంటున్నారు వీళ్లు. కొన్నేళ్ల కిందట చనిపోయిన తల్లిదండ్రులను మర్చిపోలేకపోయిన పెద్ద కొడుకు ధశరథుడు… ఒంటరిగా ఫీలయ్యాడు. తల్లిదండ్రులపై ప్రేమను చాటుకోవడానికి ఏదైనా చెయ్యాలనుకున్నాడు. తన కోరికను తన తమ్ముళ్లకు చెప్పగా… అందరూ కలిసి తల్లిదండ్రులకు గుడి కట్టారు.