మంగళగిరి ఎయిమ్స్ లో 116 పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెలాఖరు వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపిం ది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 పోస్టులను భర్తీచేయనుంది. ఇందులో వివిధ డిపార్ట్ మెంట్లలోని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 116
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి, టీచింగ్ విభాగంలో 14 ఏండ్ల అనుభవం ఉండాలి. 58 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. హార్డ్ కాపీని అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి సంబంధిత అడ్రస్‌కు పంపించాలి.
అడ్రస్: Assistant Controller of Examination, Exam Cell, Room No – 116, First Floor, Dharmashala Building, AIIMS Mangalagiri, Guntur, Andhra Pradesh, Pin – 522503.
అప్లికేషన్ ఫీజు: రూ.3,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 29
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28
వెబ్‌సైట్: www.aiimsmangalagiri.edu.in