మత్స్యకారులను లక్షాధికారుల‌ను చేసిన చేప..

చేపలు..చేపలు తింటే చాలా మంచిది. చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి తెలిసినవి కొన్నే కావచ్చు. కానీ మీకు క్రోకర్ ఫిష్ గురించి తెలుసా.. క్రోక‌ర్ ఫిష్‌.. ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా.. క‌నీసం ఈ చేప‌ను చూడ‌నైనా చూశారా.. లేదు కదా.. కాబ‌ట్టి మీరు క‌చ్చితంగా ఈ ఖ‌రీదైన చేప గురించి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ చేప గురించి తెలుసుకునే ముందు ఈ చేప ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందో కూడా తెలుసుకుందాం.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ సముద్ర తీరంలో గ్వాదర్ జిల్లాకు చెందిన‌ మత్స్యకారులు అబ్దుల్ హక్, అత‌డి సహచరులు చేప‌లు ప‌డుతున్నారు.ఆ మ‌త్స్య‌కారులు విరిసిన వ‌ల‌లో చిక్కిన చేప‌ను చూసి వాళ్లు సంబ‌రాల్లో మునిగిపోయారు. ఎందుకంటే వాళ్ల వ‌ల‌లో చిక్కింది మామూలు చేప కాదు. ల‌క్ష‌ల ఖ‌రీదు చేసే క్రోక‌ర్ చేప‌. పైగా ఆ చేప బ‌రువు కూడా 48 కిలోలు తూగింది. వెంట‌నే ఆ చేప‌ను మార్కెట్‌కు త‌ర‌లించ‌గా రూ.72 ల‌క్ష‌ల ధ‌ర ప‌లికింది. చూశారుగా.. ఒక్క చేప రాత్రికి రాత్రే ఆ మ‌త్స్య‌కారుల‌ను ల‌క్షాధికారుల‌ను చేసింది. అది ఇత‌ర చేప‌ల‌తో పోల్చుకుంటే క్రోక‌ర్ చేప‌లో ఉన్న స్పెషాలిటీ. మ‌రో ముఖ్య విష‌యం ఏందంటే ఈ చేప‌లు చేసే కుర్ కుర్ శ‌బ్దాల వ‌ల్లే వాటికి క్రోక‌ర్ చేప‌లు అనే పేరు వ‌చ్చింద‌ట‌.అయితే, క్రోకర్ చేపకు అంత డిమాండ్ ఎందుకంటే దానిలోని ఎయిర్ బ్లాడర్ వల్లనేనని ప్ర‌ముఖ జువాల‌జిస్టులు చెబుతున్నారు. చేప గాలి నింపుకుని ఈద‌డానికి ఉపయోప‌డే ఈ ఎయిర్ బ్లాడర్‌కు వైద్య చికిత్సల్లో కూడా ఎంతో ప్రాధాన్యం ఉన్న‌ద‌ట‌. చైనా, జపాన్, యూరప్‌లో దానికి చాలా డిమాండ్ ఉందట‌. శ‌స్త్ర‌చికిత్స‌ల్లో కుట్ల కోసం వినియోగించే దారం క్రోక‌ర్ చేప ఎయిర్ బ్లాడ‌ర్ నుంచే త‌యారు చేస్తార‌ట‌. ముఖ్యంగా గుండె ఆపరేషన్ల‌లో క్రోక‌ర్ చేప ఎయిర్ బ్లాడ‌ర్‌తో త‌యారు చేసిన దారాన్నే ఉప‌యోగిస్తార‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *